ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుంది..!

Sensational Director Ram Gopal Varma New Tweet Goes Viral On Internet
Sensational Director Ram Gopal Varma New Tweet Goes Viral On Internet

పెళ్లి, ప్రేమ, అనుబంధాలు ఇలాంటి కాన్సెప్ట్ లకు దూరంగా వుండే వర్మ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడట. వర్మ గురించి తెలిసి ఇది నిజం అని నమ్మితే తప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటో తెలుసుకోవాలంటే మాత్రం స్టోరీలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్. ఒక్క విషయం కాదు నేషనల్ నుండి ఇంటర్ నేషనల్ వరకూ ఎక్కడ ఏం జరిగినా దానిపై తనదైన శైలిలో స్పందించి తన ట్వీట్స్ ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి సెన్సేషన్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ పర్యటనపై పలు సరదా ట్వీట్‌లు చేసిన వర్మ మరోసారి ట్రంప్‌పై ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ట్రంప్, మోదీకి సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. వీళ్లిద్దరూ కలిసి మీట్ అయిన ఒక సందర్భంలోని ఒక వీడియో ను తీసుకొని దానికి రజనీకాంత్, మమ్ముట్టి నటించిన దళపతి సినిమాలోని ‘సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట’ అనే పాట తమిళ వర్షన్‌ను జోడించి ఎడిట్ చేశారు. ఇక మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ మధ్య స్నేహాన్ని తెలియజేసేలా ఎడిట్ చేసిన వీడియో ఆర్జీవీని బాగా ఆకట్టుకుందట. ఇక ఈ వీడియో ను వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అక్కడితో ఆగితే వర్మ ఎందుకు అవుతాడు. వీడియో పోస్ట్ చేసి ఈ వీడియో ఎడిట్ చేసిన ఎడిటర్ ను పెళ్లి చేసుకోవాలనుంది అంటూ పెట్టాడు. ఇంకేముంది ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇక ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు వర్మపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆర్టీవీలో ఇలాంటి హ్యూమర్‌ కోణం కూడా ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఈ పాట తెలుగులో అయితే ఎలా ఉంటుందో కూడా ఎడిట్‌ చేసి ఆ వీడియోను కామెంట్‌లో పెట్టారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =