అల్లరి నరేష్ 2.0 చూస్తారు ‘నాంది’ తో..!

Allari Naresh about his role in Naandi movie
Allari Naresh about his role in Naandi movie

అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇప్పుడు మరోసారి హీరోగా ‘నాంది’ అనే సినిమాతో మరో డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా పోస్టర్ తోనే ఏదో డిఫరెంట్ గా రాబోతున్నానని చెప్పకనే చెప్పాడు నరేష్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఇదే విషయాన్ని తెలిపాడు. ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తానని.. గతంలో నరేష్ కి ఈ సినిమాలో నరేష్ కు సంబంధమే ఉండదని.. ఈ సినిమాలో నరేష్ 2.0 చూస్తారని తెలిపాడు. మరి నరేష్ చెప్పినట్టు ఆ కొత్త వెర్షన్ ను చూడాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. రెండవ షెడ్యూల్ షూటింగును ఈ రోజున మొదలెట్టారు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూట్ కు బ్రేక్ పడింది. కాగా ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ లో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.