ఫైనల్లీ సామ్ ఈజ్ బ్యాక్ కాదు కాదు ‘సోషల్ మీడియా క్వీన్’ ఈజ్ బ్యాక్ అనాలి. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నందుకు బాబోయ్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సామ్ ఎందుకు సైలెంట్ అయింది.. సమంత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుందా అని కొందరు అంటే… మరికొందరు కొత్త సినిమా కథలు వెతికే పనిలో ఉందంటూ.. ఈ లాక్ డౌన్ సమయంలో తను తన పూర్తి సమయాన్ని భర్త నాగ చైతన్యతో గడపాలనే ఇలాంటి వాటికి దూరంగా ఉందని.. అసలు సమంతకు ఏమైంది అబ్బో ఇలా ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ రూమర్లకు కాస్త బ్రేక్ వేసి చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. తన కుక్కని హగ్ చేసుకొని పడుకున్న ఒక ఫొటో ను పోస్ట్ చేస్తూ.. లాంగ్ స్లీప్ తర్వాత వచ్చా.. స్టే హోమ్, స్టే సేఫ్.. మీకోసం దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ పేర్కొంది. అంతే సామ్ అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో వెంటనే తన అభిమానులనుండి సూపర్ రెస్పాన్స్ వచ్చేసింది. మరి ఈ పోస్ట్ తర్వాత కంటిన్యూ చేస్తుందా… మళ్ళీ లాంగ్ స్లీప్ లోకి వెళ్తుందా చూద్దాం ఎం జరుగుతుందో…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇక ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సామ్. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది స్యామ్. మరోవైపు పలు సినిమాలు కూడా చేస్తుంది. విజయ్ సేతుపతి, నయనతార మరియు సమంత ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇంకా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా తెరకెక్కుతుంది. వీటితో పాటు కన్నడ సినిమా దియా కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉందంట సామ్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























