ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 201
గోపీచంద్ ‘సీటీమార్’.. ఫస్టాఫ్ తాలూకు షూటింగ్ పూర్తి

ఫోన్ స్క్రిప్ట్స్ తో నవీన్ బిజీ

యన్టీఆర్ ‘రాము’కి 52 ఏళ్ళు
నితిన్ ‘పవర్ పేట్’కు మణిశర్మ స్వరాలు?
50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న విజయ్, పూరి మూవీ
'పరుగు' కాంబినేషన్‌లో మరో చిత్రం?
పూర్వ నిర్మాణ పనుల్లో 'హిరణ్య కశ్యప'
చిరంజీవికి అతిథిగా సల్మాన్ ఖాన్?
కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ లో రామ్ చరణ్
ప్రేమ వివాహానికే ఓటు -రాశీఖన్నా
'విరాట పర్వం'.. మూవీ అప్‌డేట్
ఇంద్రగంటి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ?
సమంతతో సోనీ పిక్చర్స్ చిత్రం?
సూర్యకి జోడిగా రాశి ఖన్నా
గురువుగారితో చివరి జ్ఞాపకం
రచయిత, నిర్మాత, దర్శకుడిగా సంచలన విజయాలు సాధించిన దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా, దర్శకరత్న గా పేరుగాంచారు. కళామతల్లి కి దాసరి అందించిన సేవలు వెలకట్టలేనివి. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన దాసరి శిష్యులు పలువురు దర్శకులుగా మారారు. శతాధిక చిత్ర దర్శకుడు దాసరి పుట్టిన రోజు (మే 4 వ తేదీ) ని టాలీవుడ్ దర్శకులు "డైరెక్టర్స్ డే" గా జరుపుకుంటారు.
మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళులర్పిన్నా..!
కరోనా వల్ల రాత్రింబవళ్లు ఎలాంటి అలుపు లేకుండా మన కోసం పనిచేస్తున్న డాక్టర్స్, పోలీసులు, నర్సులు మరియు పారిశుధ్య కార్మికులను ఉద్దేశించి ఇటీవలే వారికి కృతజ్ఞతలు తెలుపుతూ... టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి.. మనదేశ సైనికులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు.
విజయ్ పై కమల్ ప్రశంసలు - కమర్షియల్ మాయలో పడలేదు నువ్వు..!
తమిళ ప్రేక్షకులతో మక్కల్ సెల్వన్‌గా పిలుపించుకున్న నటుడు విజయ్ సేతుపతి. మొదటి నుండి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ.. తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకే తక్కువ కాలంలోనే మంచి నటుడిగా, స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు. పక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కీలకమైన పాత్రల కోసం విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు.
అల్లు అర్జున్‌ని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన ‘నా పేరు సూర్య’కి రెండేళ్ళు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లోని నటుణ్ణి సరికొత్త కోణంలో వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘నా పేరు సూర్య’. ఇందులో సోల్జర్‌గా దర్శనమిచ్చిన బన్నీ సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఒక సోల్జర్‌గా తనకున్న బలమైన కోరికతో పాటు తనలోని బలహీనతను కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ.. ఆ వేరియేషన్స్‌ని స్క్రీన్‌పై పర్‌ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేశాడు బన్నీ. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించగా ‘యాక్షన్ కింగ్’ అర్జున్, శరత్‌కుమార్, బోమన్ ఇరాని, ప్రదీప్ రావత్, రావు రమేష్, నదియా, సాయికుమార్, ‘వెన్నెల’ కిషోర్, పోసాని కృష్ణమురళి, కాశీ విశ్వనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు…
గోపీచంద్ ‘సీటీమార్’.. ఫస్టాఫ్ తాలూకు షూటింగ్ పూర్తి
‘గౌతమ్ నంద’(2017) తరువాత యాక్షన్ హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘సీటీమార్’. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా నాయికగా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
150 మిలియన్ క్లబ్‌లో “బుట్ట బొమ్మ” వీడియో సాంగ్
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. యువ సంగీత సంచలనం థమన్ స్వరపరచిన బాణీలన్నీ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.

ఫోన్ స్క్రిప్ట్స్ తో నవీన్ బిజీ
"లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్", "డి ఫర్ దోపిడీ" , "1నేనొక్కడినే" మూవీస్ లో నటించిన నవీన్ పోలిశెట్టి సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ " మూవీ తో టాలీవుడ్ కు హీరో గా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో నవీన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. నవీన్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ "జాతి రత్నాలు " మూవీ లో నటిస్తున్నారు.

యన్టీఆర్ ‘రాము’కి 52 ఏళ్ళు
నటరత్న నందమూరి తారక రామారావుకు బాగా అచ్చొచ్చిన దర్శకుల్లో ఎ.సి.త్రిలోకచందర్ ఒకరు. వీరిద్దరి కలయికలో మూడు చిత్రాలు (‘నాదీ ఆడజన్మే’ - 1965, ‘రాము’ - 1968, ‘పవిత్రహృదయాలు’ - 1971) తెరకెక్కగా.. ఆ మూడింటినీ విజయాలు వరించడం విశేషం. అలాంటి కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రమే ‘రాము’. యన్టీఆర్‌కు జోడిగా జమున, పుష్పలత (నూతన పరిచయం) నటించారు. ఈ చిత్రంతో బాలనటుడుగా పరిచయమైన రాజ్‌కుమార్ టైటిల్ రోల్‌లో దర్శనమివ్వగా.. ఎస్.వి.రంగారావు, నాగయ్య, రేలంగి, పద్మనాభం, రాజనాల, ఎస్.వి.రామదాస్, రమణారెడ్డి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, పెరుమాళ్ళు, గీతాంజలి, సూర్యకాంతం ముఖ్య భూమికలు పోషించారు. హిందీ సినిమా ‘దూర్…
నితిన్ ‘పవర్ పేట్’కు మణిశర్మ స్వరాలు?
యువ కథానాయకుడు నితిన్, దర్శకుడు కృష్ణచైతన్య కాంబినేషన్‌లో ‘పవర్ పేట్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాట ఘనవిజయం సాధించిన ‘వడ చెన్నై’(2018) తరహాలో ఈ చిత్రం రూపొందనుందని టాక్. అంతేకాదు.. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నితిన్‌కు జోడిగా కీర్తి సురేష్ నటించనుండగా విలన్‌గా రావు రమేష్ దర్శనమివ్వనున్నాడని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నట్టు సమాచారం.
50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న విజయ్, పూరి మూవీ
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఫైటర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సరికొత్త పాత్రలో దర్శనమివ్వనున్నాడు విజయ్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నాయికగా నటిస్తుండగా.. ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది.
'పరుగు' కాంబినేషన్‌లో మరో చిత్రం?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హిట్ చిత్రాల జాబితాలో 'పరుగు'కి కూడా స్థానం ఉంది. 2008 వేసవిలో విడుదలైన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. తొలుత యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. క్రమంగా విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరిపోయింది.
పూర్వ నిర్మాణ పనుల్లో 'హిరణ్య కశ్యప'
'బాహుబలి' సిరీస్‌తో జాతీయ స్థాయిలో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు టాలెంటెడ్ యాక్టర్ రానా దగ్గుబాటి. ఆ ఇమేజ్‌కు తగ్గట్టే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకుసాగుతున్నాడు రానా.
చిరంజీవికి అతిథిగా సల్మాన్ ఖాన్?
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో ఓ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ‘చిరు 153’గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే... ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అతిథి పాత్ర పోషించనున్నాడని టాక్.
ఆ సినీ శిఖరం ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ....
ఆయన కీర్తి - ఆచంద్రతారార్కం ఆయన శక్తి - అప్రతిహత పాశుపతాస్త్రం ఆయన ప్రతిభ - బహుముఖ విస్తృత విశ్వరూపం ఆయన లక్ష్యం - సమస్త జన సంక్షేమం ఆయన మనసు - మర్మం ఎరుగని భోలా శంకరం
కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ లో రామ్ చరణ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం" మూవీ 2021 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు కాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.
ప్రేమ వివాహానికే ఓటు -రాశీఖన్నా
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రాశీఖన్నా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ సమయాన్ని సినీ తారలు ఎంజాయ్ చేస్తూ, సోషల్ మీడియా లో వీడియోలు పోస్ట్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా రాశీఖన్నా తన అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.
'విరాట పర్వం'.. మూవీ అప్‌డేట్
రానా దగ్గుబాటి, సాయి పల్లవి నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం 'విరాట పర్వం'. 'నీదీ నాదీ ఒకే కథ' దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు. డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ డ్రామాలో 'జాతీయ ఉత్తమ నటి' అవార్డు గ్రహీత ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
ఇంద్రగంటి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్‌లో సినిమా రానుందా? అవునన్నదే ఫిల్మ్ నగర్ టాక్.
సమంతతో సోనీ పిక్చర్స్ చిత్రం?
తెలుగునాట నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా నిలుస్తోంది సమంత. 'యూ టర్న్'(2018), 'ఓ బేబీ'(2019), 'జాను'(2020)... ఇలా ఏడాదికో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో సందడి చేస్తోంది ఈ కుందనపు బొమ్మ. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సమంత.
సూర్యకి జోడిగా రాశి ఖన్నా
తెలుగునాట అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది అందాల తార రాశి ఖన్నా. కాగా ఇప్పుడు తమిళ చిత్ర సీమలోనూ అదే దిశగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా రాశి.. ఓ భారీ బడ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.