పూర్వ నిర్మాణ పనుల్లో ‘హిరణ్య కశ్యప’

Guna Sekhar Directorial Hiranya Kashyap Movie Team Gets Busy In Pre Production Work

‘బాహుబలి’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు టాలెంటెడ్ యాక్టర్ రానా దగ్గుబాటి. ఆ ఇమేజ్‌కు తగ్గట్టే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకుసాగుతున్నాడు రానా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో భాగంగానే.. తమ హోమ్ బ్యానర్‌లో భారీ బడ్జెట్ మూవీ ‘హిరణ్య కశ్యప’ చేయబోతున్నాడు ఈ దగ్గుబాటి స్టార్. అగ్రశ్రేణి దర్శకుడు గుణశేఖర్ రూపొందించనున్న ఈ మైథలాజికల్ మూవీని.. సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.

కాగా, ఆ మధ్య ‘హిరణ్య కశ్యప’ ఆగిపోయినట్టు కొన్ని వెబ్ సైట్స్ లో కథనాలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని నిర్మాత సురేష్ బాబు మాటలను బట్టి స్పష్టమైంది. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘హిరణ్య కశ్యప’ పూర్వ నిర్మాణ పనులు జరుపుకుంటోందని సురేష్ వెల్లడించారు. మొత్తానికి సురేష్ వ్యాఖ్యలతో ‘హిరణ్య కశ్యప’పై వస్తున్న గాసిప్స్ కు బ్రేక్ పడినట్లయింది.

మరి.. ‘రుద్రమదేవి’ వంటి హిస్టారికల్ మూవీ తరువాత రానా, గుణశేఖర్ కాంబినేషన్ లో వస్తున్న ‘హిరణ్య కశ్యప’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + thirteen =