తమిళ ప్రేక్షకులతో మక్కల్ సెల్వన్‌గా పిలుపించుకున్న నటుడు విజయ్ సేతుపతి. మొదటి నుండి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ.. తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకే తక్కువ కాలంలోనే మంచి నటుడిగా, స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు. పక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కీలకమైన పాత్రల కోసం విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా విజయ్ పాత్రలకు, సినిమాలకు ఫిదా అయిన విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా విజయ్ పై ప్రశంసలు కురిపించారు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకే పరిమితమమైన సంగతి తెలిసిందే. సినీ సెలెబ్రిటీస్ కూడా ఇళ్లల్లోనే వుంటున్నారు. అయితే సోషల్ మీడియా లో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కమల్ హాసన్, విజయ్ సేతుపతిల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్బంగా కమల్ హాసన్ విజయ్ సేతుపతిపై ప్రశంసలు కురిపించారు. కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల పట్ల తను ఎంత డెడికేషన్ చూపించానో ఇప్పుడు నీలో కూడా అదే చూస్తున్నానని..కేవలం కమర్షియల్ మూసలో పడిపోకుండా కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వెళ్తున్నావని ప్రశంసించాడు.
ఇక కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ మరుదనాయగం గురించి కూడా విజయ్ సేతుపతి అడుగగా దానిపై కమల్.. ఆ సినిమా ఇప్పుడు కష్టమే అని చెప్పాడు. అప్పుడు కాస్త వయసులో వున్నా కాబట్టి దానికి తగ్గట్టు కథను రెడీ చేసుకున్నాను… కానీ ఇప్పుడు చేయాలంటే కథలో కొన్ని మార్పులు చేయాలి… బడ్జెట్ కూడా ఎక్కువే అని చెప్పారు. చూద్దాం మరి ఏమవుతుందో..!




ఇక తమిళ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి.. పలు తెలుగు సినిమాల్లో కూడా కీలకమైన పాత్రల్లో నటిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: