స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లోని నటుణ్ణి సరికొత్త కోణంలో వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘నా పేరు సూర్య’. ఇందులో సోల్జర్‌గా దర్శనమిచ్చిన బన్నీ సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఒక సోల్జర్‌గా తనకున్న బలమైన కోరికతో పాటు తనలోని బలహీనతను కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ.. ఆ వేరియేషన్స్‌ని స్క్రీన్‌పై పర్‌ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేశాడు బన్నీ. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించగా ‘యాక్షన్ కింగ్’ అర్జున్, శరత్‌కుమార్, బోమన్ ఇరాని, ప్రదీప్ రావత్, రావు రమేష్, నదియా, సాయికుమార్, ‘వెన్నెల’ కిషోర్, పోసాని కృష్ణమురళి, కాశీ విశ్వనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ లగడపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్, శేఖర్ స్వరపరచిన బాణీలకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. “సైనికా”, “బ్యూటిఫుల్ లవ్”, “మాయ”, “ఇరగ ఇరగ”, “ఎన్నియల్లో ఎన్నియల్లో”, “లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో”.. ఇలా ఇందులోని పాటలన్నీ బన్నీ అభిమానులను అలరించాయి. 2018 మే 4న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను అలరించిన ‘నా పేరు సూర్య’.. నేటితో రెండేళ్ళను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: