‘గౌతమ్ నంద’(2017) తరువాత యాక్షన్ హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘సీటీమార్’. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా నాయికగా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇదిలా ఉంటే… ఇటీవల ఓ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సీటీమార్’కి సంబంధించి గోపీచంద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. కుటుంబ అనుబందాల నేపథ్యంతో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇదని.. ఇందులో కబడ్డీ కోచ్‌గా కనిపిస్తానని గోపి తెలిపాడు. అంతేకాదు.. ప్రో-కబడ్డీ చూసి పాత్రకోసం సిధ్ధమయ్యానని.. ఆట గురించి అన్ని విషయాలూ తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. అలాగే, ఈ సినిమాకి సంబంధించి 50 శాతం చిత్రీకరణ పూర్తయిందని… ద్వితీయార్థం మొదలైన సమయంలోనే కరోనాతో షూటింగ్‌కి బ్రేక్ పడిందని తెలిపాడు. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం చిత్రీకరణను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని గోపీచంద్ తెలిపాడు.
మరి, చాన్నాళ్ళుగా సరైన విజయం లేని గోపీచంద్‌కి ‘సీటీమార్’ ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: