యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్లో సినిమా రానుందా? అవునన్నదే ఫిల్మ్ నగర్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న విజయ్.. అనంతరం ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తన నెక్స్ట్ వెంచర్ చేయనున్నాడు. అలాగే ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు కాంబినేషన్లో మరో సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు విజయ్. తాజా సమాచారం ప్రకారం.. ఆ సినిమాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నట్టు తెలిసింది.
లాక్ డౌన్ అనంతరం విజయ్, ఇంద్రగంటి కాంబినేషన్ మూవీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా, ఇంద్రగంటి తాజా చిత్రం ‘వి’ విడుదలకు సిద్ధమైంది. నాచురల్ స్టార్ నాని 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాని ‘దిల్’ రాజు నిర్మించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: