సమంతతో సోనీ పిక్చర్స్ చిత్రం?

Prestigious Movie Production House Sony Pictures To Collaborate With Samantha Akkineni For A Bilingual Movie

తెలుగునాట నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా నిలుస్తోంది సమంత. ‘యూ టర్న్'(2018), ‘ఓ బేబీ'(2019), ‘జాను'(2020)… ఇలా ఏడాదికో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో సందడి చేస్తోంది ఈ కుందనపు బొమ్మ. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సమంత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు.. ‘యూ టర్న్’ తరహాలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

ఆ వివరాల్లోకి వెళితే… ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్.. సమంతతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని ప్లాన్ చేసిందట. లాక్ డౌన్ కి ముందే.. ఒప్పందాలు కూడా పూర్తయ్యాయని టాక్. ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాలో సమంత ఇదివరకు ఎన్నడూ పోషించని పాత్రలో దర్శనమిస్తుందట. అంతేకాదు.. సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరణ జరిపే దిశగా ప్లానింగ్ జరుగుతోందట.

త్వరలోనే ఈ బైలింగ్వ‌ల్ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =