ఫోన్ స్క్రిప్ట్స్ తో నవీన్ బిజీ

Agent Sai Srinivasa Athreya Fame Actor Naveen Polishetty Devotes His Lockdown Time To Listen New Movie Scripts

“లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్”, “డి ఫర్ దోపిడీ” , “1నేనొక్కడినే” మూవీస్ లో నటించిన నవీన్ పోలిశెట్టి సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” మూవీ తో టాలీవుడ్ కు హీరో గా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో నవీన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. నవీన్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “జాతి రత్నాలు ” మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నవీన్ కొన్ని సినిమాలు ఓకే చేసినట్టు, వాటిలో ఒకటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని సమాచారం. లాక్ డౌన్ సమయంలో కామెడీ వీడియోస్ పోస్ట్ చేస్తూ నవీన్ తన అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. వర్ధమాన దర్శకుల స్క్రిప్ట్స్ ఫోన్ లో వింటూ నవీన్ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రైటర్,యాక్టర్ నవీన్ తన కొత్త ప్రాజెక్ట్స్ ను లాక్ డౌన్ తరువాత అనౌన్స్ చేయనున్నారు. సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ “చిచ్చోరే” లో నవీన్ నటించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.