ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సందీప్ కిషన్ కొత్త సినిమా..!

Venkatadri Express Actor Sundeep Kishan Once Again Comes With A Wholesome Family Entertainer
Venkatadri Express Actor Sundeep Kishan Once Again Comes With A Wholesome Family Entertainer

సినిమా విజయాపజయాలతో పని లేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. ఇది తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు సందీప్ కిషన్ పుట్టిన రోజున సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించాడు. ప్ర‌ముఖ నిర్మాత జెమిని కిర‌ణ్ త‌న ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 15గా సందీప్ కిష‌న్‌తో ఒక చిత్రాన్ని ప్ర‌క‌టించారు. సందీప్ కిష‌న్‌తో ఈ బ్యాన‌ర్‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇంతకు ముందు ఈ బ్యానర్ లో సందీప్ కిషన్ ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్’‌, ‘బీరువా’ వంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాలు చేసాడు. ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రానికి భాను బోగ‌వ‌ర‌పు క‌థ అందిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రూపొంచనున్నారు. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

సాంకేతిక బృందం:
క‌థ‌: భాను బోగ‌వ‌ర‌పు
ద‌ర్శ‌కుడు: రామ్ అబ్బ‌రాజు
నిర్మాత‌: పి. కిర‌ణ్‌
బ్యాన‌ర్‌: ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =