భారత చలన చిత్ర పరిశ్రమ లో పలు బయోపిక్ మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. బయోపిక్ మూవీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు రాజకీయ కార్యకర్త, కవయిత్రి సరోజిని నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా “సరోజిని” హిందీ మూవీ రూపొందనుంది. ప్లేగు వ్యాధి టైమ్ లో సరోజిని నాయుడు అందించిన సేవలకు బ్రిటీష్ ప్రభుత్వం “కైసర్ -ఐ -హింద్” మెడల్ బహుకరించింది. ఆమె తన కవిత్వానికి “నైటింగేల్ ఆఫ్ ఇండియా” టైటిల్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాయల్ ఫిల్మ్ మీడియా సమర్పణలో కాను భాయ్ పటేల్ నిర్మాతగా ఆకాష్ నాయక్ &ధీరజ్ మిశ్రా దర్శకత్వంలో “సరోజిని ” మూవీ రూపొందనుంది. సరోజిని నాయుడు పాత్రలో దూర దర్శన్ సీరియల్ “రామాయణ్” లో సీత గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన దీపికా చిఖలియా నటిస్తున్నారు. మొదటి సారి ఒక ఫ్రీడమ్ ఫైటర్ పై రూపొందుతున్న “సరోజిని” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. “సరోజిని” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























