‘భారతీయుడు 2’ ఆగిపోలేదు.. అవన్నీ రూమర్స్ మాత్రమే..!

Bharateeyudu 2 Movie Team Quashes Rumours Of Cancelling Movie Shooting
Bharateeyudu 2 Movie Team Quashes Rumours Of Cancelling Movie Shooting

‘భారతీయుడు 2’ ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ మొదటి నుండీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అసలు ఈ సినిమా మొదలవ్వడమే లేట్ అయింది… ఆ తర్వాత కమల్ కు ఏదో మేకప్ వల్ల స్కిన్ అలర్జి వచ్చిందని అప్పుడు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ షూట్ మొదలుపెట్టి నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్నారు కదా అనుకునే మళ్ళీ క్రేన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన కాస్త సీరియస్సే అయింది. ఇక దీనితో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన లైకా ప్రొడక్షన్స్ యాజమాన్యం.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అవి కేవలం రూమర్స్ మాత్రమే.. ఇప్పటికే 60 శాతం వరకూ షూటింగ్ పూర్తయింది.. ఇప్పుడు ఎందుకు సినిమాను ఆపేయాలని చూస్తాం.. ఈ లాక్ డౌన్ తీసేసిన వెంటనే.. మిగిలిన షూట్ ను కూడా తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేస్తామని చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్‌, ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్, విద్యుత్ జమ్వాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమాను తమిళ సంవ‌త్స‌రాది సందర్భంగా 2020 ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. మరి చూద్దాం ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో.

1996 వచ్చిన శంకర్, క‌మ‌ల్ హాస‌న్‌ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘భార‌తీయుడు’ ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మరి ఇన్ని అడ్డంకులను తట్టుకొని ఈ సీక్వెల్ తీస్తున్నారు. మరి ఈ సీక్వెల్ ఎంత విజయం సాధిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 4 =