‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ టైమ్ లెస్ క్లాసిక్

Jagadeka Veerudu Athiloka Sundari Is A Timeless Classic Says Mega Star Chiranjeevi
Jagadeka Veerudu Athiloka Sundari Is A Timeless Classic Says Mega Star Chiranjeevi

‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ సినిమా గురించిన విశేషాలు ఇప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే నానితో ఆ సినిమా ఎలా మొదలైందో.. ఎలా పూర్తయింది.. ఆ సినిమా విశేషాలు ఏంటి.. తెర వెనుక.. తెర ముందు మనకు తెలియని ఎన్నో విషయాలను వాయిస్ ఓవర్ తో ఓ వీడియో తో చెపుతున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా గురించి.. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తను కూడా ఒక వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా అనేది సమిష్ఠి కృషి ఫలితం అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం సాధించిన విజయం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ చిత్ర విజయంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్.. నటీనటులు తమ ప్రతిభను కనబరిచినందుకే జగదేకవీరుడు అతిలోకసుందరి తెలుగు సినిమా క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయిందని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ 25 చిత్రాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు తప్పక స్థానం ఉంటుంది. క్లాసిక్ అంటే జనరేషన్ గ్యాప్ లేని సినిమా. ఇది పాత తరం సినిమా.. కొత్త తరం సినిమా అనే తేడా లేకుండా అన్ని తరాలను అలరించే టైమ్ లెస్ క్లాసిక్ సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. ఏ తరం వాళ్లు ఈ సినిమా చూసినా.. ఇప్పటికీ కొత్తగా ఉంటుంది. ఇలాంటి గొప్పి సినిమాలో నటించే అవకాశం దొరకడం నా అదృష్టం గా భావిస్తానని అన్నారు.

 


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 12 =