13B హార్రర్ సీక్వెల్ లో చైతు..?

Akkineni Naga Chaitanya To Play The Lead Role In Vikram Kumar Horror Thriller 13B Movie Sequel
Akkineni Naga Chaitanya To Play The Lead Role In Vikram Kumar Horror Thriller 13B Movie Sequel

మాధవన్, నీతూ చంద్ర ప్రధాన పాత్రల్లో…విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 13B ఎంత మంచి విజయం దక్కించుకుందో తెలుసు. 2009లో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఆ సినిమా, తెలుగులోను విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు ఉత్కంఠపరిచే థ్రిల్లింగ్ మూమెంట్స్ తో.. ట్విస్ట్ లతో మంచి సస్పెన్స్ ను క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా గురించిన ఉపోద్ఘాతం ఎందుకంటారా..? అసలు సంగతేంటంటే ఈ హార్రర్ థ్రిల్లర్ కు సీక్వెల్ రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఈ సీక్వెల్ లో నాగ చైతన్య హీరో గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్రమ్ కుమార్,చైతు కాంబినేషన్ లో మనంతర్వాత మరో సినిమా వస్తున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నట్టు తెలిసిందే. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో బిజీ గా వున్నాడు. ఈ సినిమా కూడా రిలీజ్ అవ్వాలి కానీ లాక్ డౌన్ వల్ల రిలీజ్ అవ్వలేదు. లవ్ స్టోరీ తర్వాత విక్రమ్ కుమార్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ నే చైతు కోసం రెడీ చేస్తున్నాడట. ప్రస్తుతం విక్రమ్ కుమార్ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లోనే వున్నాడట. లాక్ డౌన్ తరువాత ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

నాగచైతన్య ఇటీవల కాలంలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విజయాలను తన ఖాతాలో జమ చేసుకుంటూ వెళుతున్నాడు. ‘వెంకీమామ’, ‘మజిలీ’ సినిమాలతో హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. మరి ఈ హార్రర్ జోనర్ అయితే ఇప్పటి వరకు ట్రై చేయలేదు. చూద్దాం ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.