చిరు లూసిఫర్ సినిమా ఇంకా ప్రారంభం కాకముందే అప్పుడే ఈ సినిమాలో కాస్టింగ్ పై పలు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముందు అల్లు అర్జున్ నటిస్తున్నాడని.. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం కూడా లేదని అన్నారు. ఇప్పుడు తాజాగా ఈ వార్తలపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. లూసిఫర్ రీమేక్ కు సంబంధించి కథలో మార్పులు
జరుగుతున్నాయని.. బాలీవుడ్ హీరో సల్మాన్ నటిస్తున్నాడని వస్తున్న వార్తలు రూమర్స్ అని కొట్టి పడేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనులుపూర్తయిన తరువాతే నటీనటులు ఎంపిక జరుగుతుందని చెప్పారు. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందో లేదో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం చిరు కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.
సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలామంది యంగ్ డైరెక్టర్స్ కు అవకాశం ఇస్తున్నారు. ఇక చిరుతో సినిమా తీయాలనుకున్న డైరెక్టర్స్ చిరు కోసం కథలు రాసే పనిలో పడ్డారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: