ప్రయోగాత్మక చిత్రంగా ‘ఐకాన్’..!

Sriram Venu Icon Going To Be Another Versatile Movie For Stylish Star Allu Arjun
Sriram Venu Icon Going To Be Another Versatile Movie For Stylish Star Allu Arjun

శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సుకుమార్ సినిమా కంటే ముందే మొదలవ్వాలి కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా లేట్ అయింది. ఇక ప్రస్తుతం శ్రీరామ్ వేణు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో బిజీ గా వున్నాడు. మరోవైపు బన్నీ సుకుమార్ సినిమాతో బిజీగా వున్నాడు. వారి సినిమాలు పూర్తయిన తర్వాత వీరిద్దరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. ‘ఐకాన్’ విషయంలో అల్లు అర్జున్ కావాలనే గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఇది ప్రయోగాత్మక చిత్రమని తెలుస్తోంది. ఇలాంటి సినిమాలు చేయాలంటే కొంచం ఎక్కువ టైం పడుతుందని. అందువలన కొంత గ్యాప్ తరువాత ఈ సినిమా చేయడమే కరెక్ట్ అని బన్నీ అనుకుంటున్నాట్టుగా తెలుస్తుంది. అందుకే ముందు సుకుమార్ సినిమా చేసేస్తే ఒక పని అయిపోతుందని.. ఆ తర్వాత ఐకాన్ సినిమా చేయొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్‌ గా కేరళ కుట్టి నివేదా పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =