కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 177

సినిమా వార్తలు

ప్రముఖ నటుడు మురళీ శర్మకి మాతృవియోగం

ఒకపక్క లాక్ డౌన్ వల్ల సినిమా పరిశ్రమకు అసలే కష్టాలు వచ్చిపడ్డాయి. దానికితోడు వరుసపెట్టి పలు ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్ననే కన్నడ యంగ్ హీరో, ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్‌ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా నిన్న మధ్యాహ్నం మృతి చెందాడు. ఇక మరో ప్రముఖ నటుడు మురళీ శర్మకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి శ్రీమతి పద్మ శర్మ గారు గత రాత్రి ముంబైలోని స్వగృహంలో గుండె పోటుతో ఆకస్మిక మృతి చెందారు. ఆమె వయస్సు 76 సంవత్సరాలు. వయసు రీత్యా ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిన్న కన్నుమూశారు.

TFN Adminవాట్సాప్
Virata Parvam Director Venu Udugula Heaps Praises On Actress Sai Pallavi For Her Performance In The Movie
సినిమా వార్తలు

సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ అదుర్స్

సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి ,సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 90 ల నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో "విరాటపర్వం 1992 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి , నందితాదాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "విరాటపర్వం 1992 " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులకు శుభవార్త

అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో రూపొందిన "మనం "మూవీ ఘనవిజయం సాధించింది. నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , తారక రత్న, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కలసి ఒక మూవీ లో నటిస్తే బాగుంటుందని నందమూరి అభిమానుల అభిలాష. బాలకృష్ణ , ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ సక్సెస్ ఫుల్ హీరోలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. తన కుటుంబ హీరోలతో నటించడానికి తాను సిద్ధమే నని బాలకృష్ణ అనౌన్స్ చేశారు.

Team TFNవాట్సాప్
Tollywood Veteran Actor Nandamuri Balakrishna Gives Clarity About His Son Mokshagna Debut In To Movies
సినిమా వార్తలు

తనయుడి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..!

తెలుగు తెరపై మన అగ్ర హీరోలు చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నాగార్జున తనయుడు నాగచైతన్య ఇప్పటికే వెండితెరపై దూసుకుపోతున్నారు. ఇక వెంకటేష్ తనయుడు అంటే ఇంకా చిన్నోడు కాబట్టి ఎంట్రీ ఇవ్వడానికి చాలా టైమ్ ఉంది. ఇప్పుడు అందరి దృష్టి బాలకృష్ణ తనయుడిపై పడింది. అంతేకాదు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీపై ఇప్పటికే చాలా వార్తలు కూడా వచ్చాయి. గత మూడేళ్ళునుండే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై అనేక వార్తలు వచ్చాయి కానీ ఎప్పుడూ ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు. నందమూరి ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

అంజలి క్వారంటైన్ డబ్బింగ్

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా స్తంభించిపోయిన చిత్ర పరిశ్రమకు తమిళనాడు ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకునేలా వెసులుబాటు కల్పించింది. దీంతో సినీ తారలు మోడరన్ టెక్నాలజీ తో ఇంటినుండే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బడ్జెట్ తగ్గించే ప్లాన్ లో ఆచార్య..!

లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమకు బాగానే లాస్ వచ్చింది. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఆగిపోయాయి. దీనితో కొన్ని వేల కోట్లే నష్టం వచ్చింది. ఒకవేళ సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా కూడా బడ్జెట్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో కొంతమంది దర్శక నిర్మాతలు ముందు భారీ బడ్జెట్ అనుకున్నా ఇప్పుడు తమ బడ్జెట్ ను తగ్గించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ నిర్మాతగా ఆయన నటిస్తున్న ఆచార్య మూవీ బడ్జెట్ కూడా తగ్గించే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మొదటినుండి ఈ సినిమాకు కూడా చాలా ఆటంకాలే వచ్చాయి. ఇప్పటికే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వసూల్ రాణి తాప్సి

"ఝుమ్మంది నాదం " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించి తెలుగు , తమిళ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తాప్సి , సూపర్ హిట్ "చష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. పలు సూపర్ హిట్ హిందీ మూవీస్ తో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న తాప్సి నటన కు ప్రాధాన్యత ఉన్న ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఎంపిక చేసుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రకుల్ పాత జ్ఞాపకాలు

తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రకుల్ ప్రీత్ ప్రస్తుతం హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. రకుల్ నటించిన రొమాంటిక్ యాక్షన్ మూవీ "మర్జావాన్ " ఘనవిజయంతో బాలీవుడ్ లో బిజీగా మారారు. అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న మూవీ , జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "అటాక్ " మూవీలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

పెంగ్విన్ టీజర్ రిలీజ్

ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'పెంగ్విన్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. జూన్ 19వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్ వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో సమంత రిలీజ్ చేయగా.. తమిళ్ లో త్రిష మలయాళంలో మంజు వారియర్, హిందీలో తాప్సి ఈ సినిమా టీజర్ లను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శింబు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి టి.రాజేందర్

తమిళ్ స్టార్ హీరో శింబుపై ప్రేమ, పెళ్లి అనే ఈ రెండు టాపిక్స్ పై ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటది. గతకొద్దికాలంగా శింబు ప్రేమ జోలికి వెళ్లకుండా సైలెంట్ గానే ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా శింబు పెళ్లిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. లండన్ కు చెందిన అమ్మాయితో శింబు పెళ్లి జరగనున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. లాక్ డౌన్ అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకోనున్నారని కూడా కథనాలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"RRR" లో ప్రత్యేక పాత్రలో శ్రియ శరన్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Rashi Khanna Turns Singer Once Again
సినిమా వార్తలు

సింగర్ రాశీఖన్నా

తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన రాశీఖన్నా తమిళ భాష, గిటార్ నేర్చుకుంటూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం "అరణ్మణై 3"మూవీ లో నటిస్తున్నారు. సూర్య హీరోగా రూపొందే "అరువా ", పా .విజయ్ దర్శకత్వంలో రూపొందే "మేధావి " తమిళ మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Versatile Actor Siddharth To Play Negative Shaded Role In Ajay Bhupathi Maha Samudram
సినిమా వార్తలు

'మహా సముద్రం' లో నెగెటివ్ పాత్రలో సిద్దార్థ్..!

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లు గా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత కార్తికేయ, పాయల్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించగా.. అజయ్ భూపతి మాత్రం తన రెండో సినిమాను ఇంతవరకూ పట్టాలెక్కించలేదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కన్నడ యంగ్ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం

ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు మృతి చెందటం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో అయితే గత రెండు నెలల్లోనే ఎంతోమంది లెజెండ్రీ నటులు చనిపోయారు. ఇప్పుడు తాజాగా మరో యంగ్ హీరో హఠాన్మరణం అందరినీ షాకింగ్ కు గురిచేస్తుంది. ఆ హీరో కన్నడ యంగ్ హీరో, ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్‌ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా. నిన్న మధ్యాహ్నం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో చిరంజీవి సర్జాను హాస్పిటల్‌లో జాయిన్‌ చేయగా.. చికిత్స పొందుతూ చిరంజీవి సర్జా మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చిరంజీవి సర్జా స్వగ్రామం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా…

TFN Adminవాట్సాప్
Tollywood Director Ravibabu Posts A Fun Video On Social Media
సినిమా వార్తలు

అయిపోయిందా.. ఇప్పుడు నేను చెక్ చేస్తా..!

డైరెక్టర్ కమ్ నటుడు రవిబాబు సినిమాల్లో ఎంత కామెడీ పండిస్తాడో.. నిజజీవితంలో కూడా అలానే ఆయన వ్యవహార శైలి కూడా వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆయన ఓ సూపర్ మార్కెట్ దగ్గర చేసిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా నేపథ్యంలో ఇప్పుడు అందరికి థర్మల్ స్కానర్ తో టెస్ట్ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సూపర్ మార్కెట్ వెళ్లిన రవిబాబు కు అక్కడ మెయిన్ ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ గార్డు థర్మల్ స్కానర్ తో ఆయన్ని చెక్ చేయగా, "అయిపోయిందా... ఇప్పుడు నేను చెక్ చేస్తాను" అంటూ తన జేబులోంచి థర్మల్ స్కానర్ తీసిన రవిబాబు ఆ సెక్యూరిటీ…

TFN Adminవాట్సాప్
Vishal Upcoming Movie Chakra Teaser To Release Soon
ట్రైలర్ & టీజర్

త్వ‌ర‌లో రానున్న విశాల్ ‘చ‌క్ర‌’ టీజ‌ర్..!

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన అభిమన్యుడు చిత్రానికి సీక్వెల్ గా అన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఈ చిత్ర షూటింగ్‌ ముగియడానికి వారం రోజుల ముందు లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రస్తుతం నాకు అంత టైమ్ లేదు..!

సెలెబ్రిటీస్ పై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటది. ఇక ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై అయితే వాళ్ళకి తెలియని వాళ్ళతో కూడా ముడిపెట్టి వార్తలు రాసేస్తుంటారు. వాళ్ళు అలాంటిది ఏంలేదని చెప్పినా కూడా ఆ వార్తలు మాత్రం ఆగవు. ఇప్పుడు హీరోయిన్ రాశీఖన్నా పరిస్థితి కూడా అలానే వుంది. ఈ భామ పై కూడా ఈ మధ్య కాలంలో పలానా వ్యక్తితో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విషయాలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దేశం గర్వించే నిర్మాత మీరు..!

ఈ రోజు మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85 వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాదు ఫిలిం ఛాంబర్ ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ‌ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు దర్శకులతో మణిరత్నం వెబ్ సిరీస్ ?

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం భారత పురాణ కథలతో అమెజాన్ ప్రైమ్ కొరకు ఒక వెబ్ సిరీస్ రూపొందించనున్నారని సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో 9 ఎపిసోడ్స్ ఉంటాయని, ఒక్కొక్క ఎపిసోడ్ కు ఒక తెలుగు దర్శకుడు దర్శకత్వం వహిస్తారని, కొంతమంది తెలుగు దర్శకులతో మణిరత్నం చర్చలు జరుపుతున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజాహెగ్డే బ్లాక్ &వైట్ ఫొటో

టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు , అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (స్పెషల్ సాంగ్ ), వరుణ్ తేజ్ లతో పూజాహెగ్డే జోడీగా నటించిన మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" , "Prabhas 20" మూవీస్ లో నటిస్తున్నారు. ఒక తెలుగు మూవీ కి , రెండు బాలీవుడ్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్