త్వ‌ర‌లో రానున్న విశాల్ ‘చ‌క్ర‌’ టీజ‌ర్..!

Vishal Upcoming Movie Chakra Teaser To Release Soon
Vishal Upcoming Movie Chakra Teaser To Release Soon

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన అభిమన్యుడు చిత్రానికి సీక్వెల్ గా అన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఈ చిత్ర షూటింగ్‌ ముగియడానికి వారం రోజుల ముందు లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ దీనిపై మాట్లాడుతూ.. వారం రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు అనుమతివ్వ గానే షూటింగ్‌ పూర్తవుతుందని‌ తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం టీజర్‌ తయారు చేస్తున్నామని, త్వరలో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ స్వయంగా నిర్మిస్తుండగా శ్రద్దా శ్రీనాధ్, రెజీనా కాసాండ్రా, శ్రుతీ డాంగే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా రోబో శంకర్‌, కేఆర్‌ విజయ, మనోబాలా, విజయబాబు తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 9 =