అయిపోయిందా.. ఇప్పుడు నేను చెక్ చేస్తా..!

Tollywood Director Ravibabu Posts A Fun Video On Social Media
Tollywood Director Ravibabu Posts A Fun Video On Social Media

డైరెక్టర్ కమ్ నటుడు రవిబాబు సినిమాల్లో ఎంత కామెడీ పండిస్తాడో.. నిజజీవితంలో కూడా అలానే ఆయన వ్యవహార శైలి కూడా వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆయన ఓ సూపర్ మార్కెట్ దగ్గర చేసిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా నేపథ్యంలో ఇప్పుడు అందరికి థర్మల్ స్కానర్ తో టెస్ట్ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సూపర్ మార్కెట్ వెళ్లిన రవిబాబు కు అక్కడ మెయిన్ ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ గార్డు థర్మల్ స్కానర్ తో ఆయన్ని చెక్ చేయగా, “అయిపోయిందా… ఇప్పుడు నేను చెక్ చేస్తాను” అంటూ తన జేబులోంచి థర్మల్ స్కానర్ తీసిన రవిబాబు ఆ సెక్యూరిటీ గార్డుకు టెంపరేచర్ చెక్ చేయడం… ఆపై, “నీకేమీ లేదు, నువ్వు ఓకే” అని చెప్పి సూపర్ మార్కెట్లోకి సీరియస్ గా వెళ్లిపోయారు. ఈ వీడియో చూడటానికి కామెడీ గా నవ్వుతెప్పిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవిబాబు. నచ్చావులే సినిమా నుండి… మొన్న వచ్చిన అదుగో సినిమా వరకూ ప్రతి ఒక్క స్టోరీ విభిన్నంగానే ఉంటుంది. అదుగో సినిమాలో ఓ పందిపిల్లతో మరీ నటన చేయించిన వినూత్న దర్శకుడు రవిబాబు. ఇటీవల ఆవిరి అనే టైటిల్ తో మరో వైవిధ్యమైన కథను తీయగా అది కూడా విజయాన్ని అందించలేకపోయింది.

‘ఆవిరి’ సినిమా తర్వాత రవిబాబు తాజాగా చేస్తున్న చిత్రం ‘క్రష్‌’. సైలెంట్ గా ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన పోస్టర్లను‌ విడుదల చేశారు. తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 3 =