కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

సింగర్ రాశీఖన్నా

Actress Rashi Khanna Turns Singer Once Again

సింగర్ రాశీఖన్నా

Actress Rashi Khanna Turns Singer Once Again

Actress Rashi Khanna Turns Singer Once Again

తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన రాశీఖన్నా తమిళ భాష, గిటార్ నేర్చుకుంటూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం "అరణ్మణై 3"మూవీ లో నటిస్తున్నారు. సూర్య హీరోగా రూపొందే "అరువా ", పా .విజయ్ దర్శకత్వంలో రూపొందే "మేధావి " తమిళ మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

గాయకురాలిగా రాశీఖన్నా "జోరు ", "బాలకృష్ణుడు ", "జవాన్ ", "ప్రతి రోజూ పండగే ", విలన్ (మలయాళ ) మూవీస్ లో సాంగ్స్ పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాశీఖన్నా ఇప్పుడు అమెరికన్ గాయని బిలీ ఐలిష్ సాంగ్ ను గిటార్ ప్లే చేస్తూ పాడి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు . రాశీఖన్నా మాట్లాడుతూ .. గిటార్ నేర్చుకొనడం తాను పాజిటివ్ గా ఉండడానికి హెల్ప్ చేసిందని , గిటార్ పట్టుకున్న ప్రతి సారీ తన వదనం లో చిరునవ్వు వస్తుందని , ఈ వీడియో అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నానని , మరో సాంగ్ తో త్వరలోనే మీ ముందుకు వస్తానని తెలిపారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్