సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ అదుర్స్

Virata Parvam Director Venu Udugula Heaps Praises On Actress Sai Pallavi For Her Performance In The Movie

సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి ,సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 90 ల నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో “విరాటపర్వం 1992 ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి , నందితాదాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “విరాటపర్వం 1992 ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విరాటపర్వం 1992 ” మూవీ లో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కు దర్శకుడు వేణు ఫిదా అయ్యి ఆమె పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు వేణు మాట్లాడుతూ .. ప్రేమమ్ ” మూవీ లో సాయి పల్లవి నటన బాగా నచ్చిందని , తన ఫస్ట్ మూవీ “నీదీ నాదీ ఒకే కథ ” కు సంప్రదించానని , సాయి పల్లవి బిజీగా ఉండడంతో కుదరలేదని, “విరాటపర్వం 1992 ” మూవీ లో క్యారెక్టర్ కు సాయి పల్లవి న్యాయం చేస్తారని ఫిక్స్ అయ్యానని, స్టోరీ కి ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ మూవీ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారని , “విరాటపర్వం 1992 ” మూవీ కి సాయి పల్లవి ప్లస్ అవుతుందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =