దేశం గర్వించే నిర్మాత మీరు..!

Mega Star Chiranjeevi Speaks About His Bonding With Movie Mogul Dr Rama Naidu On His Birth Anniversary Through A Post on Social Media
Mega Star Chiranjeevi Speaks About His Bonding With Movie Mogul Dr Rama Naidu On His Birth Anniversary Through A Post on Social Media

ఈ రోజు మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85 వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాదు ఫిలిం ఛాంబర్ ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ‌ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన జయంతి సందర్భంగా గుర్తుచేసుకున్నారు. “రాజా …!” అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూసాను. కారంచేడు నుంచి ఓ కుర్రాడు, దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించటమే కాదు…నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణం.సినిమా అంటే మీకున్న ప్రేమ,మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయం అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

తెలుగు సినీ చరిత్రలో లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ఎన్నో సంచలన విజయాలు అందించారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చాలా మంది నటీనటులను ఈయన పరిచయం చేసాడు. అంతేకాదు అనేక భాషలలో అతి తక్కువ కాలంలో శతాధిక చిత్రాలను నిర్మించి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన నిర్మాత రామానాయుడు. అన్ని భారతీయ భాషల్లోనూ సినిమాలు నిర్మించి ఎవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 9 =