కన్నడ యంగ్ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం

Kannada Actor Chiranjeevi Sarja is no more
Kannada Actor Chiranjeevi Sarja is no more

ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు మృతి చెందటం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో అయితే గత రెండు నెలల్లోనే ఎంతోమంది లెజెండ్రీ నటులు చనిపోయారు. ఇప్పుడు తాజాగా మరో యంగ్ హీరో హఠాన్మరణం అందరినీ షాకింగ్ కు గురిచేస్తుంది. ఆ హీరో కన్నడ యంగ్ హీరో, ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్‌ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా. నిన్న మధ్యాహ్నం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో చిరంజీవి సర్జాను హాస్పిటల్‌లో జాయిన్‌ చేయగా.. చికిత్స పొందుతూ చిరంజీవి సర్జా మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చిరంజీవి సర్జా స్వగ్రామం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా జక్కేనహళ్లిలో అంత్యక్రియలు జరుగుతాయి. చిరంజీవి ఆకస్మిక మరణంతో చిత్ర పరిశ్రమ, ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన నటుడికి కన్నీటి నివాళి అర్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మొదట అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన చిరంజీవి సర్జా..ఆ తర్వాత నటుడిగా మారి 2009లో ‘వాయుపుత్ర’ అనే చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సర్జా ‘చిర్రు’, ‘చంద్రలేఖ’, ‘ఆటగర’, ‘భార్జరి’, ‘సీజర్’, ‘అమ్మ ఐ లవ్ యు’, ‘సింగా’, త‌దిత‌ర సినిమాల్లో నటించారు. ఆయన ఆఖరి సినిమా ‘శివార్జున’. తన కెరీర్‌ మొత్తంలో 19 సినిమాలు చేస్తే అందులో 14 చిత్రాలు రీమేక్‌లే కావడం గమనార్హం. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అందులో ఒక సినిమాకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతుండగా, మూడు సినిమాలు షూటింగ్ దశల్లో ఉన్నాయి.నటి మేఘనా రాజ్‌ను చిరంజీవి 2018లో వివాహం చేసుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 3 =