సరైన అమ్మాయి ఇంకా దొరకలేదు..!

Sundeep Kishan says he is not finding the right girl
Sundeep Kishan says he is not finding the right girl

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ చిన్నగా ఇప్పుడిప్పుడే ఖాళీ అవుతుంది. ఆ లిస్ట్ లో అందరికంటే ముందున్న రానా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇక నిఖిల్ ఇప్పటికే పెళ్లి చేసేసుకున్నాడు. నితిన్ పెళ్లి కూడా ఎప్పుడో అయిపోవాలి కానీ కరోనా వల్ల లేట్ అయింది. ఇక రీసెంట్ గా సాహో డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా తన పెళ్లి గురించి చెపుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ తన పెళ్లి ప్లన్స్ గురించి చెపుతూ.. గత మూడేళ్ళ నుండి సింగిల్ గానే ఉంటున్నా.. సరైన అమ్మాయి ఇంకా దొరకలేదు అని చెప్పాడు. అంతేకాదు.. తనకు కావాల్సిన అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా చెపుతున్నాడు. తనకు కావాల్సిన అమ్మాయి స్ట్రాంగ్ గా స్మార్ట్ గా ఇన్స్పైర్ చేసేలా వుండాలని చెపుతున్నాడు. మరి చూడబోతే సందీప్ కిషన్ కూడా త్వరలోనే శుభవార్త చెప్పేలా కనిపిస్తున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

ఇక సందీప్ కిషన్ ప్రస్తుతం డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో “A1 ఎక్స్ ప్రెస్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ ఈసినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ
ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 8 =