మీ త్యాగానికి మా సెల్యూట్..!

We Salute Your Bravery and Patriotism Tweets Super Star Mahesh Babu About Martyed Soldiers In Galwan Valley

లఢక్ లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఇండియా మరియు చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు మరో 19 మంది భారత జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా అందరూ స్పందిస్తూ చైనా వైఖరిపై మండిపడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ట్వీట్లతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌, నిఖిల్‌ సిద్దార్థ‌, అనిల్‌ సుంకర, ప్రణీత, మంచు విష్ణు, లక్ష్మీ మంచు, వరుణ్‌ తేజ్‌, అనిల్‌ రావిపూడి, తదితరులు వీరజవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా వీరి మరణంపై సూపర్ స్టార్ మహేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సంతాపం తెలిపారు. మీరు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటారు.. మీ త్యాగానికి, దేశభక్తికి మా సెల్యూట్ అని చెప్పారు. ఆ సైనికుల కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని మహేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉండగా ఇక మహేష్ గత చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.