మాజీ నక్సలైట్ దగ్గర ‘భారతక్క’‌ ట్రైనింగ్

Actress Priyamani Takes Formal Training From A Former Naxalite For Virata Parvam Movie
Actress Priyamani Takes Formal Training From A Former Naxalite For Virata Parvam Movie

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి సాయి పల్లవి, ప్రియమణి ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ప్రియమణి నక్సలైట్ భారతక్క అనే పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర చేయడం కోసం ఆమె నిజంగానే నక్సలైట్‌ను కలిసిందట. వేణు ఉడుగుల సూచన మేరకు గతంలో నక్సలైట్‌గా పని చేసి తర్వాత జన జీవన స్రవంతిలో కలిసిన ఓ వ్యక్తిని ప్రియమణి కలిసి తన దగ్గర ట్రైనింగ్ తీసుకుందట. నక్సలైట్ల జీవన విధానం ఎలా ఉంటుంది.. వాళ్ల ప్లానింగ్ ఎలా ఉంటుంది.. లైఫ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్.. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాకే భారతక్క పాత్ర కోసం రంగంలోకి దిగిందట ప్రియమణి.

కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్‌,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫిగా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =