షూటింగ్స్ కు సిద్ధంగా లేను – కీర్తి సురేష్

I Am Not Ready To Join Movie Shooting Says Actress Keerthy Suresh

సక్సెస్ ఫుల్ “నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ స్వంతం చేసుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి నటించిన “మిస్ ఇండియా “(తెలుగు ), “మరక్కార్ “(మలయాళ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. “గుడ్ లక్ సఖి “, “రంగ్ దే “, “అన్నాత్తే (తమిళ ) మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ సమయంలో సుమారు మూడు నెలలపాటు మూవీ షూటింగ్స్ , రిలీజ్ లు , థియేటర్స్ బంద్ అయ్యి చిత్రపరిశ్రమ నష్టాల పాలయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూవీస్ షూటింగ్స్ జరుపుకొనడానికి షరతులతో కూడిన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. స్టార్ హీరోలు షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధంగా లేరు. స్టార్ హీరోలతో పాటు స్టార్ హీరోయిన్స్ కూడా షూటింగ్స్ అంటే భయపడుతున్నారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ .. పరిస్థితులు బాగా లేవని , ఇటువంటి సమయంలో షూటింగ్స్ అంటూ రిస్క్ తీసుకొనడం తనకు ఇష్టం లేదని , మనం జాగ్రత్తగా ఉన్నా , మన చుట్టుపక్కల వారు జాగ్రత్తలు పాటించాలి కదా , కనీసం రెండు ,మూడు నెలలు షూటింగ్స్ లో పాల్గొనకుండా ఉండడం ఉత్తమం అని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.