“ఉప్పెన” మూవీ పై సాయి తేజ్ స్పందన

I Am Eagerly Awaiting For Uppena Movie Release Says Tollywood Actor Sai Dharam Tej

మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఉప్పెన” మూవీ సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్”ఉప్పెన” మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సాయి ధరమ్ తేజ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తన సోదరుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ కు పరిచయంకావడం సంతోషంగా ఉందని , “ఉప్పెన” మూవీ కై ఆసక్తితో ఎదురు చూస్తున్నానని , రిలీజ్ సమయం లో “ఉప్పెన” మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సాయి తేజ్ ప్రస్తుతం “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.