ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన Vi ఆనంద్ “హృదయం ఎక్కడున్నది ” మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సైన్స్ ఫిక్షన్ “అప్పుచి గ్రామం ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. రొమాంటిక్ థ్రిల్లర్ “ఎక్కడికి పోతావు చిన్నవాడా ” మూవీ తో సక్సెస్ సాధించారు. “ఒక్క క్షణం “, “డిస్కో రాజా ” వంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“అతనొక్కడే “, “పటాస్ “, “118” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన హీరో కళ్యాణ్ రామ్ తన స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై సూపర్ హిట్ ” కిక్ 2″, “జై లవకుశ ” మూవీస్ నిర్మించారు. ఇప్పుడు Vi ఆనంద్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక థ్రిల్లర్ మూవీ రూపొందనుందని సమాచారం. ఆనంద్ నరేట్ చేసిన స్టోరీ లైన్ కు కళ్యాణ్ రామ్ ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, దర్శకుడు ఆనంద్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా ఉన్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: