రజినీ – కమల్ సినిమా ఆగేది లేదు..!

Rajinikanth And Kamal Haasan’s Movie Was Not Shelved

కరోనా వల్ల షూటింగ్ లు లేక ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడి ఉన్నాయి. అసలు షూటింగ్ లు అయిన సినిమాలకే రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. ఇంకా షూటింగ్ అవ్వని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇంకా సెట్స్ పైకి వెళ్లని సినిమాల సంగతి గురించి చెప్పేదేముందని. కొన్ని సినిమాలు అయితే ఆగిపోయాయంటు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రజినీ-కమల్ సినిమా కూడా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం రజినీ అజిత్‌తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నాడు. ఖుష్బూ,మీనా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో…. కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్.. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమాను కమల్ ఏప్రిల్ లోనే ప్రారంభించాలని ప్లాన్ చేసాడు. కానీ లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ షూటింగ్ లు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోయిందంటున్నారు. కానీ అవి కేవలం రూమర్స్ మాత్రమే అని తెలుస్తుంది. కాస్త పరిస్థితులు చక్కబడిన తర్వాత నవంబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ విజయ్ తో మాస్టర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కమల్ రజినీ సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేశాడు. మరి ఈ సినిమాలో కమల్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటాడో? లేదో? తెలియాలంటే మాత్రం అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.