రూమర్స్ ను కొట్టిపడేసిన బోయపాటి..!

Director Boyapati Srinu Quashes Rumors Of Casting Amala Paul In His New Movie With Nandamuri Balakrishna

మరోసారి బాలయ్య – బోయపాటి సినిమా హీరోయిన్ వార్త తెరపైకి వచ్చింది. గతంలోనే బోయపాటి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త హీరోయిన్ ను ఈ సినిమాలో పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇక కొద్దిరోజులు ఈ రూమర్లకు బ్రేక్ పడినా మళ్ళీ రెండు రోజులుగా ఒక హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అమలా పాల్. బాలకృష్ణ సరసన అమలా పాల్ నటించనున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ వార్తలపై బోయపాటి స్పందిస్తూ బాలయ్య హీరోయిన్ పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. అమలా పాల్ ను ఈ సినిమా కోసం తీసుకున్నట్లు గా వస్తున్న వార్తలు నిజం కాదన్నాడు. ఈ సినిమా కోసం మొదట స్టార్ హీరోయిన్ ను అనుకున్నప్పటికి చివరకు కొత్త అమ్మాయిని పరిచయం చేయాలనే నిర్ణయానికి వచ్చాం.. ఏదిఏమైనా కొత్త హీరోయిన్నే తీసుకొస్తాం అని రూమర్లను ఖండించాడు.

ఇక ఇదిలా ఉండగా.. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 3 =