ఫైనల్లీ.. బ్యాక్ టు వర్క్

Taapsee Pannu is back to work again

కరోనా దెబ్బకి షూటింగ్ లు లేక సెలబ్రిటీస్ అందరు దాదాపు మూడు నాలుగు నెలల నుండి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలు పెడుతుండటతో ఒక్కొక్కరూ షూటింగ్ లలో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాప్సి కూడా షూట్ కి రెడీ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా తెలియచేసింది. షూటింగ్ లొకేషన్ లో తన మేకప్ రూమ్ లో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ బ్యాక్ టు వర్క్ అనే క్యాప్షన్ ను జోడించింది. బాలీవుడ్ లో షూటింగ్ మొదలుపెట్టిన మొదటి వ్యక్తి తాప్సి కావడం విశేషం. అందరూ షూటింగ్ లు మొదలు పెట్టడానికి భయపడుతున్న వేళ తాప్సి ధైర్యంగా షూట్ లో పాల్గొనడానికి సిద్దమయిందంటే మెచ్చుకోతగ్గ విషయమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర‌కి ప‌రిచయమైంది తాప్సీ. తెలుగులో ఈ అమ్మ‌డికి అంత స‌క్సెస్‌లు లేక‌పోయిన హిందీలో మాత్రం భారీ విజ‌యాల‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది తాప్సీ.

“చష్మే బద్దూర్ ” మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన తాప్సీకి తొలుత అక్కడ కూడా సరైన విజయం దక్కలేదు. ఆ తర్వాత పింక్, బద్లా, మిషన్, తప్పడ్ ఇలా వరుస హిట్స్ తో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పాగా వేసింది. తాప్సీ ప్రస్తుతం హిందీలో “హసీన్ దిల్ రుబా “, “లూప్ లపేట్ “, “శభాష్ మిథు ” సినిమాల్లో నటిస్తుండగా.. తమిళ్ లో జయం రవి హీరోగా హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 3 =