తెలుగు రీమేక్ కు మలయాళం హిట్ సినిమా ‘కప్పేల’..!

Malayalam Blockbuster Movie Kappela Will Be Remade In Telugu Soon

ఒక భాషలో సినిమాలు మరో భాషలో రీమేక్ అవ్వడం ఇప్పుడు పరిపాటి అయిపోయింది. ఇటీవల మన తెలుగు సినిమాలు ఎన్నో బాలీవుడ్ లో రీమేక్ అవ్వడం చూసాం. అంతేకాదు ఆ సినిమాలు అక్కడ కూడా మన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా మన తెలుగు వాళ్లకు మలయాళ సినిమాలపై కన్ను పడింది. అక్కడ హిట్ అయిన వెంటనే తెలుగు హక్కులను కొనేస్తున్నారు. ఇప్పటికే అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ రానా, రవితేజలతో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సంస్థ ఇప్పుడు మరో మలయాళ హిట్ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. మొహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కప్పేల’ సినిమా ఇటీవలే రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో ఈ సినిమా రీమేక్ హక్కులను కూడా సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎవరు నటిస్తారో ఏంటో తదితర వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా గతంలో మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెలుగులో తీస్తే మంచి ఫలితాన్నందుకుంది సితార ఎంటర్ టైన్మెంట్స్. మరి ఈ రెండు సినిమాలు తెలుగులో ఎలాంటి ఫలితం అందిస్తాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.