తన బయోపిక్ తీసే ప్లాన్ లో వెటరన్ హీరో కార్తీక్..!

Veteran Actor Karthik Plans To Make A Biopic Movie On Himself

తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇప్పుడు మరో హీరో కూడా తన బయోపిక్ తానే తీసుకునే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు వెటరన్ హీరో కార్తీక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తీక్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే పేర్లు అభినందన, సీతాకోక చిలుక, ఘర్షణ అబ్బో ఇలాంటి క్లాసిక్ సినిమాలు ఎన్నో చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1980, 90 దశకాల్లో ఉన్న స్టార్ హీరోల జాబితాలో కార్తీక్ పేరు ఉండాల్సిందే. ఇక ఆ తర్వాత అనుకోకుండా సినిమాలకు దూరమయ్యాడు కార్తీక్. ఇటీవల మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం కార్తీక్ ప్రస్తుతం తన ఆటోబయోగ్రఫీ రాసుకునే పనిలో వున్నాడట. అంతేకాదు తన బయోపిక్ ను కూడా తానే తెరకెక్కించాలన్న ప్లాన్ లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరిన్ని విషయాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.