ఎన్టీఆర్ Vs మనోజ్ – అంతా తూచ్..!

Tollywood Actor Manchu Manoj Gives Clarity That He Is Not Part Of NTR Trivikram New Movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో `అయిననూ పోయి రావలే హస్తినకు` అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు త్రివిక్రమ్. అయితే ఈ సినిమాపై ఏదో ఒక వార్త బయటకి వస్తూనే వుంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. దానిపై ఇంకా క్లారిటీ రాకముందే రెండు రోజులుగా మరో రూమర్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో నటించే విలన్ పాత్రపై. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అసలు ఎవరూ ఊహించని పేరు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో మంచు మనోజ్ నటిస్తాడని వార్తలొచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ వార్తలపై స్పందించిన మనోజ్ “నన్ను ఎన్టీఆర్ సినిమా గురించి ఎవరు సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు. అయినా నేను విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమే.. కానీ దానికి ఇంకా టైం ఉంది” రూమర్స్ ను కొట్టిపారేశాడు. మరి చిత్రయూనిట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలిపేంత వరకూ ఈ రూమర్లు ఆగవు.

కాగా ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.