మీకు తెలుసా.. ఆస్కార్ అవార్డ్స్ కు ఇన్విటేషన్ అందుకున్న తొలి సౌత్ హీరో చిరు..!

Unknown fact about Megastar Chiranjeevi

ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగ.. డైలాగ్ చెప్పినా.. డ్యాన్స్ చేసినా ఫ్యాన్స్ కు పూనకాలే. ఇలా ఒక్కటేంటి.. అతడేం చేసినా అభిమానులకు అదో పండగే. ఆ హీరో ఎవరో ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. ఇంకెవరు భారతీయ సినీ పరిశ్రమ గర్వించతగ్గ హీరో చిరంజీవి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొణిదెల శివ శంకర వరప్రసాద్ ఈ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అదే మెగా స్టార్ చిరంజీవి అంటే భారతీయ సినీ ప్రేక్షకులకు ఆయన పరిచయం అక్కర్లేనిది. సినిమాలపై ఆసక్తితో తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి.. మొదట్లో కొన్ని విలన్ పాత్రలు కొన్ని ప్రత్యేక పాత్రల్లో నటించి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వెండి తెరపై ఎన్నో రికార్డ్స్ ను తిరగ రాశారు. ఈయ‌న న‌టించిన తొలి సినిమా ప్రాణం ఖ‌రీదు. సెప్టెంబ‌ర్ 22, 1978లో విడుద‌లైంది. పునాదిరాళ్లు ముందు మొద‌లుపెట్టినా విడుద‌లైంది మాత్రం ప్రాణంఖ‌రీదు సినిమానే. ఇక ఆ సినిమా నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవకావం రాలేదు.

అప్పటి వరకు ముఖంలో హావభావాలు పలికించే నటను పండిస్తే సరిపోయేది. అయితే చిరు వచ్చిన తర్వాతమొత్తం మారిపోయింది. ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు నటన ఒక్కటే కాదు ఇండస్ట్రీలోనే ఎప్పుడూ లేని విధంగా తన బ్రేక్ డాన్సులతో ప్రేక్షకుల మతిపోగొట్టేశాడు.

ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా ఎదిగారు చిరంజీవి. అయన నట జీవితం గురించి ఎన్ని విశేషాలు ఎన్ని రకాలుగా చెప్పుకున్న తరగవు. ఖైదీ సినిమాతో చిరు సినీ కెరీర్ మరోకీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఆయన 41 ఏళ్ళ సినీ కెరీర్ లో అయన చేసిన సినిమాలు, అయన సంపాదించిన బిరుదులు, అవార్డులు, కలెక్షన్స్ రికార్డ్స్ అబ్బో లెక్కలేనన్ని. ఆయన సినీ ప్రయాణం వెండితెరపై ఒక వెలుగు వెలగాలనుకునే వారికి ఒక స్ఫూర్తినిచ్చే పుస్తకం లాంటిది.

ఇక ఇండియన్ సినీ చరిత్రలో కూడా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో కూడా చిరంజీవినే. అంతేకాదు టాలీవుడ్ కి పరిచయం లేని ఎన్నో రికార్డ్ లను పరిచయం చేశారు. ‘గెస్ట్ ఆఫ్ హానర్’ గా 1987లో జరిగిన అకాడమీ అవార్డ్స్ కి ఆయన్ని ఆహ్వానించారు. ఆస్కార్ అవార్డ్స్ కి సౌత్ ఇండియా నుండి ఇన్విటేషన్ అందుకున్న నటుల్లో చిరంజీవి తొలి వ్యక్తి కావడం విశేషం.

ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. దశాబ్ధం గ్యాప్ ఇచ్చి వచ్చినా కూడా 100 కోట్ల మార్క్ (బాహుబలి కాకుండా) ను దాటి తన స్టామినాచూపించాడు. ప్రస్తుతం కొరటాలతో ఆచార్య సినిమా చేస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.