పవన్ సినిమా తర్వాత ‘ఐకాన్’ సినిమానే..!

Director Sriram Venu To Make Icon Movie With Allu Arjun After Completing Vakeel Saab Movie

శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దీనితో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అదేంలేదంటూ ఇటీవలే క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీరామ్ వేణు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో బిజీ గా వున్నాడు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే శ్రీరామ్ ఐకాన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల ప్లాన్ లో ఉన్నాడట. వకీల్ సాబ్ తర్వాత ఇకపై ఎలాంటి ఆలస్యం చేయకూడదని వేణు శ్రీరామ్ నిర్ణయించుకున్నాడట.

మరోవైపు బన్నీ సుకుమార్ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. ఎలాగూ శ్రీరామ్ వకీల్ సాబ్ తో బిజీ గా ఉండటంతో బన్నీ కూడా ఈ గ్యాప్ లో పుష్ప సినిమా పూర్తి చేయాలనే ప్లాన్ లో వున్నాడు. ఎందుకంటే ఐకాన్ సినిమాకు కాస్త ఎక్కువ టైమే పట్టనున్నటు ఇప్పటికే పలు వార్తలు విన్నాం. ఇక వారి సినిమాలు పూర్తయిన తర్వాత వీరిద్దరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చూద్దాం మరి ఎం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − four =