పెళ్లి చేసుకోమని దుల్కర్ మోటివేట్ చేసేవాడు..!

Dulquer Salmaan Used To Motivate Me To Get Married Says Actress Nithya Menen

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ కలిసి ‘బెంగళూర్ డేస్’, ‘ఓకే కన్మని’, ‘100 డేస్ ఆఫ్ లవ్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందన్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా దుల్కర్ గురించి మాట్లాడుతూ..‌. `దుల్కర్ పూర్తిగా ఫ్యామిలీ పర్సన్. పెళ్లి చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని చెప్పేవాడు. పెళ్లి చేసుకోమని నన్ను మోటివేట్ చేసేవాడు. `ఓకే బంగారం` సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. వెండితెర మీద మమ్మల్ని చూసుకుని మేమే ఆశ్చర్యపోయాం` అని నిత్య తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నటన విషయంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ ఇద్దరిలో ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఇద్దరు టాలెంటెడ్ నటులే. ఇక ఇద్దరూ ఒక భాషకే పరిమితం కాకుండా అవకాశం వచ్చిన అన్ని భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. దుల్కర్ మహానటి సినిమాలో తెలుగు తెరకు పరిచయమై జెమిని గణేషన్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక నిత్యా గురించి చెప్పేదేముంది. పాత్ర ప్రధానమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిన మాత్రమే కాదు బాలీవుడ్ లో సైతం నటించి, మెప్పించారు.

కాగా త్వరలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీతో రానుంది నిత్యా. ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్ ఇదివరకెన్నడూ పోషించని పాత్రలో కనిపిస్తుందని టాక్. కరోనా వల్ల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ సినిమాను నాలుగు భాషలు తెలుగు, తమిళ, మల‌యాళ, కన్నడతో పాటు హిందీలోనూ ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.