ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 106
"రాధేశ్యామ్"సెట్స్ లో ప్రభాస్ , జయరామ్ సెల్ఫీ

అనన్య పాండే "ఫైటర్ "మూవీ షూటింగ్ ఎక్స్ పీరియన్స్
ప్రభాస్ 21.. అమితాబ్ పాత్రపై క్లారిటీ
'సాహో' - 'ఇన్స్బ్రక్'లో షూట్ అద్భుతం
అరకులో 'గాలి సంపత్' సందడి
ఛాలెంజింగ్ రోల్ లో త్రిష
మరో సారి జంటగా సునీల్ , సలోని
షాట్ గ్యాప్ లో కీర్తి సురేష్
ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ ?
'బుజ్జిగాడు' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
విశ్వక్ సేన్ "పాగల్ " మూవీ వర్కింగ్ స్టిల్
హైదరాబాద్ లో స్టార్ హీరో యశ్
పూల పై కాజల్ అగర్వాల్ ప్రేమ
'ఛత్రపతి' రీమేక్ కు వినాయక్..!
'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ డేట్ ఫిక్స్
మొత్తానికి థియేటర్స్ ఓపెన్ అవుతుండటంతో చిన్న చిన్నగా సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి కర్చీఫు వేసుకున్నాయి. ఇక త్వరలో క్రిస్మస్ వుంది కాబట్టి ప్రస్తుతం ఈ పండగకు చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే ప్లాన్ లో వున్నాయి. సుమంత్ ప్రధాన పాత్రలో వస్తున్న కపటధారి సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేయడానికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు మరో సినిమాను కూడా క్రిస్మస్ కు రిలీజ్ చేయడానికి ముహుర్తం ఖరారు చేశారు. ఆ సినిమా ఏదో కాదు మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా.
"రాధేశ్యామ్"సెట్స్ లో ప్రభాస్ , జయరామ్ సెల్ఫీ
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా పీరియాడిక్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ , మలయాళ స్టార్ హీరో జయరామ్ , ప్రియదర్శి , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
లావణ్య త్రిపాఠి ఇన్ స్టాగ్రామ్ లో 2మిలియన్ ఫాలోవర్స్
సక్సెస్ ఫుల్"అందాల రాక్షసి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి "దూసుకెళ్తా ", "మనం ", "భలే భలే మగాడివోయ్ ", సోగ్గాడే చిన్ని నాయనా ", అర్జున్ సురవరం "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.సందీప్ కిషన్ హీరో గా హాకీ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ "మూవీ షూటింగ్ ను లావణ్య కంప్లీట్ చేశారు. ఈ మూవీ లో తన పాత్రకై లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ పొందారు.

అనన్య పాండే "ఫైటర్ "మూవీ షూటింగ్ ఎక్స్ పీరియన్స్
ఒకప్పుడు దక్షిణాది భాషల హీరోయిన్స్ బాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపేవారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ దక్షిణాది మూవీస్ లో నటించడానికి ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు. బాలీవుడ్ మూవీస్ కు ధీటుగా దక్షిణాది భాషా చిత్రాలు భారీ బడ్జెట్ తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ దక్షిణాది మూవీస్ లో అవకాశాలకై ఎదురు చూస్తున్నారు. "ఫైటర్" మూవీ తో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
ప్రభాస్ 21.. అమితాబ్ పాత్రపై క్లారిటీ
నాగ్ అశ్విన్ దర్సకత్వంలో ప్రభాస్ 21 సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాటు భారీ కాస్ట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెజెండరీ యాక్టర్ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ను ఈ సినిమా కోసం తీసుకున్నట్టు గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఒక లెజెండరీ నటుడు లేకుండా ఇంత భారీ సినిమా ఎలా తీయగలం అంటూ అప్పట్లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు.
'సాహో' - 'ఇన్స్బ్రక్'లో షూట్ అద్భుతం
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో.. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అనేక భాషలలో విడుదలై విజయబావుటా ఎగురవేసింది. మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నిజానికి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 400 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది.
"రౌద్రం రణం రుధిరం" మూవీ కి చిరంజీవి వాయిస్ ఓవర్ ?
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రౌద్రం రణం రుధిరం "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. రే స్టీవెన్ సన్ , అలీ సన్ డూడీ ,సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సీనియర్ హీరోయిన్ శ్రియ అతిథి పాత్రలలో నటిస్తున్నారు.
అరకులో 'గాలి సంపత్' సందడి
కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ప్రస్తుతం " రాజ రాజ చోర" సినిమాతో బిజీ గా వున్నాడు. హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు.
ఛాలెంజింగ్ రోల్ లో త్రిష
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని త్రిష స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో త్రిష ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన 3 తమిళ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. 4 తమిళ మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. త్రిష ఇప్పుడు తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బిగ్ బాస్ 4 - కంటెస్టెంట్స్ పై 'బిగ్ బాస్' ఆగ్రహం
బిగ్ బాస్ 4 - రెండు రోజుల పాటు జరిగిన దెయ్యం టాస్క్ ఒక రకంగా ప్రేక్షకులకు బోర్ కొట్టడమే కాకుండా.. అటు బిగ్ బాస్ కు నచ్చలేదు. దీనితో హౌస్ మేట్స్ పై బిగ్ బాస్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది బిగ్ బాస్ ఇళ్లు అని.. బిగ్ బాస్ అనుమతి లేకుండా ఏదీ జరగదన్న విషయం మరిచిపోయారని, దెయ్యం జలజ మీకు ఇచ్చిన టాస్క్‌లను నిరాకరించారని.. అభిజిత్ ఈ టాస్క్‌లో పాల్గొనడానికి నిరాకరించారని అందుచేత అభిజిత్‌ని వరస్ట్ పెర్ఫామర్ గా ప్రకటించారు బిగ్ బాస్.
'థ్యాంక్ యు బ్రదర్' షాకిస్తున్న అనసూయ లుక్
రమేష్ రాపర్తి దర్శకత్వంలో అనసూయ భరద్వాజ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో 'థ్యాంక్ యు బ్రదర్' టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్‌ల ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

స్టార్ హీరో సుదీప్ సర్ ప్రైజింగ్ ట్రాన్స్ ఫర్మేషన్
"తాయవ్వ "(1997 ) మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన సుదీప్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులనుఅలరిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డ్స్ అందుకున్న సుదీప్ తెలుగు , తమిళ , హిందీ మూవీస్ లో కూడా నటించారు. రెండు దశాబ్దాలకుపైగా యాక్టర్, సింగర్, ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా సుదీప్ కళామతల్లికి సేవలు అందిస్తున్నారు. "ఈగ ", "సైరా నరసింహ రెడ్డి "మూవీస్ తో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సుదీప్ ప్రస్తుతం "ఫాంటమ్ "కన్నడ మూవీ లో నటిస్తున్నారు.
మరో సారి జంటగా సునీల్ , సలోని
సునీల్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ కమెడియన్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు . సక్సెస్ ఫుల్ మూవీ "అందాలరాముడు " తో సునీల్ హీరోగా మారి ప్రేక్షకులను అలరించారు. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ , సలోని జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ "మర్యాదరామన్న " (2010 ) మూవీ ఘనవిజయం సాధించింది. "మర్యాద రామన్న "మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. 10 సంవత్సరాల తరువాత మరోసారి సునీల్ , సలోని జంటగా నటించి ప్రేక్షకులను అలరించనున్నారు.
షాట్ గ్యాప్ లో కీర్తి సురేష్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నితిన్ ,కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !"మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , కౌసల్య , వినీత్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ తరువాత "రంగ్ దే !"మూవీ షూటింగ్ హైదరాబాద్ లో పునః ప్రారంభం అయ్యింది. "రంగ్ దే !"మూవీ షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతుంది.
ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ ?
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కియారా అద్వానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ హిందీ రీమేక్ "కబీర్ సింగ్ " మూవీ లో కియారా అద్వానీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. "కబీర్ సింగ్ " మూవీ ఘనవిజయం తో కియారా పలు బాలీవుడ్ అవకాకాశాలు అందుకున్నారు. కియారా ప్రధాన పాత్రలో రూపొందిన "ఇందూ కి జవానీ "మూవీ డిసెంబర్ 11 వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
'బుజ్జిగాడు' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
ప్రభాస్, త్రిష కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటగా వచ్చిన ‘వర్షం’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇద్దరి కెరీర్ కు బ్రేక్ ఇచ్చిందని చెప్పొచు. రెండో సినిమా ‘పౌర్ణమి’ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
విశ్వక్ సేన్ "పాగల్ " మూవీ వర్కింగ్ స్టిల్
హైదరాబాద్ లో పుట్టి ,పెరిగిన విశ్వక్ సేన్ ముంబై థియేటర్ ఆర్ట్స్ లో జర్నలిజం డిగ్రీ చేశారు. "వెళ్ళిపోమాకే "మూవీ తో కెరీర్ ప్రారంభించిన విశ్వక్ సేన్ "ఈ నగరానికి ఏమైంది "మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సక్సెస్ ఫుల్ "ఫలక్ నుమా దాస్ "మూవీ తో దర్శకుడిగా విశ్వక్ మారారు. విశ్వక్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "HIT - ది ఫస్ట్ కేస్ " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో విశ్వక్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. విశ్వక్ ప్రస్తుతం "పాగల్ "మూవీ లో నటిస్తున్నారు.
హైదరాబాద్ లో స్టార్ హీరో యశ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ "కెజిఎఫ్ చాప్టర్ 1 " కన్నడ మూవీ సీక్వెల్ "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.
పూల పై కాజల్ అగర్వాల్ ప్రేమ
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హే సనామికా "తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో 16.6మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కాజల్ సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
'ఛత్రపతి' రీమేక్ కు వినాయక్..!
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ ల లిస్ట్ లో వి.వి వినాయక్ కూడా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా ఉండేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. ఎంతో మంది కొత్త వాళ్లు తెలుగు తెరకు పరిచయమవుతున్న నేపథ్యంలో పాత డైరెక్టర్లు కూడా పాతబడిపోతున్నారు. ఒకప్పటి చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు ఆ ఫేజ్ ను ఫేస్ చేస్తున్నారు. ఓ మంచి సక్సెస్ కోసం... మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో వినాయక్ కూడా ఒకరు.