‘సాహో’ – ‘ఇన్స్‌బ్రక్‌’లో షూట్ అద్భుతం

UV Creations Team Shares A Throwback video of Saaho movie shoot in austria

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ నేపథ్యంలో.. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమా అనేక భాష‌ల‌లో విడుద‌లై విజ‌య‌బావుటా ఎగుర‌వేసింది. మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నిజానికి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. మొత్తంగా బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా 400 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఆ పాటలకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఆస్ట్రేలియాలోని ఇన్స్‌బ్రక్‌లో చేసిన షూటింగ్‌ను ఈ వీడియోలో చూపించారు. `ఇన్స్‌బ్రక్‌లో షూటింగ్ ఓ అద్భుత అనుభవం. అక్కడి వాతావరణం, మంచి మనసున్న మనుషులు, అద్భుత కట్టడాలు సూపర్. మా షూటింగ్‌ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ఇన్స్‌బ్రక్` అని ప్రభాస్ పేర్కొన్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ తో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి నాగ్ అశ్విన్ సినిమా కూడా వుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.

కాగా వీటితోపాటు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్. మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =