ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 105
పాయల్ రాజ్ పుత్ మనసులో మాట
"కరోనా వైరస్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

నాగ శౌర్య 20 టైటిల్ రిలీజ్
బర్త్ డే కి మొక్కలు నాటిన రాశీ
కొత్త జానర్ లో విశ్వక్ సేన్ ?
నాగశౌర్య స్టైలిష్ లుక్
పూజాహెగ్డే సూపర్ బిజీ
నైట్ షూట్ కు గుడ్ బై చెప్పిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
రాశీఖన్నా డ్రీమ్ రోల్
'స్పీడున్నోడు' సత్య హిలేరియస్ కామెడీ
మహేష్ సినీప్రస్థానానికి 41ఏళ్లు
"ఆదిపురుష్" లో సీత కృతి సనన్ ?
రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ
బాలీవుడ్ కి వెళ్తున్న ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'..?
కరోనా ఎక్స్పీరియన్స్ - 10 కేజీలు బరువు తగ్గిపోయా
ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్'. 'క్రాక్' తో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు వీరిద్దరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేయగా కొంత భాగం అక్కడ చిత్రీకరించారు. ఇక కొంతభాగం మిగిలిఉండగా ఇప్పుడు అది కంప్లీట్ చేయడానికి చిత్రయూనిట్ గోవా వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని రవితేజ తన ఇన్‌స్టా ద్వారా తెలియచేశారు. ఫైనల్ షెడ్యూల్ కోసం గోవా వెళ్తున్నట్టు పోస్ట్ లో పేర్కొన్నాడు.
పాయల్ రాజ్ పుత్ మనసులో మాట
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీతో పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో పాయల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "ఏంజెల్ " మూవీ తో పాయల్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. పాయల్ ప్రస్తుతం "నరేంద్ర ", " 5 డబ్ల్యూస్ "మూవీస్ లో నటిస్తున్నారు.
బిగ్ బాస్ 4 - బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చిన అరియానా
బిగ్ బాస్ 4 - 'రేస్ టు ఫినాలే' టాస్క్ మొదటి లెవెల్ అయిపోగా రెండో లెవల్ కి అభిజిత్, హారిక, సోహెల్ ఇంకా అఖిల్ మిగిలారు. మరి వారికోసం బిగ్ బాస్ రెండో లెవెల్ లో ఏం గేమ్ ప్లాన్ చేసాడు.. ఎవరు మూడో లెవెల్ కి వెళ్లారు అన్నది తెలియాలంటే నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూడాల్సిందే.
"కరోనా వైరస్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించి వివాదాస్పద దర్శకుడిగా మారారు. రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా పలు మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్స్ నిలిచిపోయినా , కరోనా టైమ్ లో తగిన జాగ్రత్తలతో పలు మూవీస్ ను తెరకెక్కించిన ఘనత వర్మదే.
బిగ్ బాస్ 4 - 'రేస్ టు ఫినాలే' స్టార్ట్
బిగ్ బాస్ 4 - నిన్న హాట్ హాట్ గా నామినేషన్ ప్రక్రియ జరగగా ఈ రోజు ఫినాలే టాస్క్ పెట్టేసాడు బిగ్ బాస్. మరి ఈ రోజు ఈ టాస్క్ లో ఏం జరిగింది.. ఏమేం సంఘటనలు చోటుచేసుకున్నాయి లాంటి విషయాలు తెలియాలంటే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

బిగ్ బాస్ 4 - 13వ వారం నామినేషన్ లిస్ట్
బిగ్ బాస్ 4 - ఆదివారం అయిపోయింది... సోమవారం వచ్చింది అంటే అందరు నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక సోమవారం రానే వచ్చేసింది. నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మరి ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారో తెలియాలంటే ఈవారం ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.

నాగ శౌర్య 20 టైటిల్ రిలీజ్
సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ ను రిలీజ్ ఇటీవలే చేయగా అందులో నాగశౌర్య లుక్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 8ప్యాక్ తో నాగ శౌర్య మంచి కండరాలు తిరిగిన బాడీ తో మునుపెన్నడూ లేనంతగా ఈ సినిమాలో కనిపించనున్నాడని అర్ధమవుతుంది.
బర్త్ డే కి మొక్కలు నాటిన రాశీ
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇక ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్న రాశీ బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే, వెంకీ మామ లాంటి హిట్ సినిమాల్లో తన నటనతో మెప్పించింది.
కొత్త జానర్ లో విశ్వక్ సేన్ ?
"వెళ్ళిపోమాకే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ "ఈ నగరానికి ఏమైంది ", "ఫలక్ నుమా దాస్ ", మిస్టరీ థ్రిల్లర్ "HIT- ది ఫస్ట్ కేస్ " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. విశ్వక్ "పాగల్", "HIT 2 "మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. విశ్వక్ ప్రస్తుతం పాండిచ్చేరి లో జరుగుతున్న "పాగల్ "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
నాగశౌర్య స్టైలిష్ లుక్
హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాగశౌర్య నటించే చిత్రాలలో కొత్త కథానాయికలకు అవకాశం ఇస్తున్నారు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా స్పోర్ట్స్ డ్రామా "NS20 "మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ లో తన పాత్రకై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ తో సిద్ధం అయ్యారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య , షిర్లీ సేతియా జంటగా రూపొందనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ పూజాకార్యక్రమం జరుపుకుంది.
పూజాహెగ్డే సూపర్ బిజీ
సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "అల వైకుంఠపురం లో .. " మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో నటిస్తున్నారు. టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు అవకాశాలు అందుకుంటూ సూపర్ బిజీగా ఉన్న పూజాహెగ్డే సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
నైట్ షూట్ కు గుడ్ బై చెప్పిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
కరోనా వల్ల దాదాపు 8నెలలు షూటింగ్ కు గ్యాప్ తీసుకున్న ఆర్ఆర్ఆర్ టీం ఈమధ్యే షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు. అంతేకాదు హెవీ వింటర్ లో కూడా షూట్ చేస్తున్నట్టు ఇప్పటికే పలు వీడియోలు పోస్ట్ చేస్తూ తెలియచేస్తూనే వున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఫైనల్ గా నైట్ షెడ్యూల్ కు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దాదాపు 50రోజుల పాటు ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను నైట్స్ లో చలిలో ఇన్ని రోజులు చిత్రీకరణ చేశాం. ఫైనల్ గా ఈ షూట్ అయిపోయింది. త్వరలో మరో కొత్త…
రాశీఖన్నా డ్రీమ్ రోల్
సక్సెస్ ఫుల్ "ఊహలు గుస గుస లాడే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల రాశీఖన్నా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "ఇమైక్క నోడిగళ్ "మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెట్టిన రాశీఖన్నా పలు మూవీస్ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుని కోలీవుడ్ లో బిజీగా మారారు. రాశీఖన్నా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. "అరణ్మణై 3 ", "తుగ్లక్ దర్బార్ "మూవీ షూటింగ్స్ తో రాశీఖన్నా బిజీగా ఉన్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'స్పీడున్నోడు' సత్య హిలేరియస్ కామెడీ
స్వామి రారా,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్,కార్తీకేయ వంటి సినిమాల ద్వారా హాస్య నటుడిగా 'సత్య' మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వామి రారా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు డైరెక్టర్ సుధీర్ వర్మ సత్యలో కామెడీ యాంగిల్ నచ్చడంతో ఆ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక ఆ సినిమా సత్యకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. తన కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయింది. స్వామి రారా సినిమాతో టాలీవుడ్‌కు మంచి కమెడియన్ దొరికాడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.. వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే 50 సినిమాలకు పైగానే నటించాడు ఈయన. ఇక స్పీడున్నోడు సినిమాలో కూడా సత్య…
మహేష్ సినీప్రస్థానానికి 41ఏళ్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు నట ప్రస్థానానికి 41ఏళ్లు అయ్యాయి. అదేంటీ ఇటీవలే కదా 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు కదా.. ఇప్పుడు 41 ఏళ్ళు అన్న డౌట్ వస్తుంది కదా. అసలు సంగతేంటంటే.. మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే.. బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. 'నీడ' అనే చిత్రంతో బాల నటుడిగా 1979లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఇక ఈ సినిమా నేటితో 41 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
"ఆదిపురుష్" లో సీత కృతి సనన్ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కనున్న "ఆది పురుష్" మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టి - సిరీస్ ఫిల్మ్స్ , రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్ " తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కనుంది. 3D ఫార్మాట్ లో తెరకెక్కనున్న ఈ మూవీ లో రాముడిగా ప్రభాస్ , లంకేశ్వరుడు గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీత గా పలువురి హీరోయిన్స్ పేర్లు వినిపించినా ఫైనల్ గా కృతి సనన్ ఎంపిక అయినట్టు సమాచారం.
బిగ్ బాస్ 4 - ఎవిక్షన్ పాస్ తో గట్టెక్కిన అవినాష్
బిగ్ బాస్ 4 - మొత్తానికి ఎవిక్షన్ పాస్ వలన అవినాష్ ఎలిమినేషన్ అనే గండం నుండి తప్పించుకున్నాడు. మరి అవినాష్ తన ఎవిక్షన్ పాస్ ను ఎలా వాడుకున్నాడు... అసలు నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒక లుక్కేద్దాం.
రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ
'కెరటం "మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ ఫుల్ "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" మూవీ తో గుర్తింపు పొందారు. "లౌక్యం ", "కరెంట్ తీగ ", "పండగ చేస్కో ", "నాన్నకు ప్రేమతో ", "సరైనోడు ", "ధృవ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో రకుల్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు మూవీస్ తోపాటు రకుల్ తమిళ , హిందీ భాష లలో సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు.
బాలీవుడ్ కి వెళ్తున్న ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'..?
మన టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు బాలీవుడ్ లో బాగానే డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఇక్కడ హిట్ సినిమాల్లో ఏదో ఒకటో రెండో సినిమాలు అక్కడ రీమేక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలు రీమేక్ కు సిద్ధంగా ఉండగా ఇటీవలే మన టాలీవుడ్ హీరో సాయి శ్రీనివాస్ ఛత్రపతి సినిమా రీమేక్ చేస్తున్నాడు. 15ఏళ్ల క్రితం వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
కరోనా ఎక్స్పీరియన్స్ - 10 కేజీలు బరువు తగ్గిపోయా
హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ అందరికీ ఒకేసారి కరోనా రాగ ముందు పిల్లలు శివాని, శివాత్మికలు కరోనా నుండి కోలుకోగా ఆ తర్వాత జీవిత కూడా తొందరగానే కోలుకుంది. అయితే రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై మాత్రం కొన్ని రోజులు టెన్షన్ నడిచింది. కొద్దిరోజులు పలు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత శివాని, శివాత్మికలే రాజశేఖర్ హెల్త్ గురించి రెగ్యులర్ అప్ డేట్స్ ఇచ్చారు. అయితే చాలా రోజులు టెన్షన్ తర్వాత ఫైనల్లీ రాజశేఖర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.