నాగ్ అశ్విన్ దర్సకత్వంలో ప్రభాస్ 21 సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాటు భారీ కాస్ట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెజెండరీ యాక్టర్ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ను ఈ సినిమా కోసం తీసుకున్నట్టు గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఒక లెజెండరీ నటుడు లేకుండా ఇంత భారీ సినిమా ఎలా తీయగలం అంటూ అప్పట్లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో అమితాబ్ రోల్ పై పలు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో అమితాబ్ కేవలం అతిథి పాత్రలో మాత్రమే నటిస్తున్నారని పలు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై స్పందించిన చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. అమితాబ్ పాత్ర అతిథి పాత్ర కాదని.. ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నారని.. ప్రభాస్ పాత్రతో సమానంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
ఇక బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు. పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























