‘ఛత్రపతి’ రీమేక్ కు వినాయక్..!

Chatrapathi Hindi Remake Confirmed

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ ల లిస్ట్ లో వి.వి వినాయక్ కూడా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా ఉండేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. ఎంతో మంది కొత్త వాళ్లు తెలుగు తెరకు పరిచయమవుతున్న నేపథ్యంలో పాత డైరెక్టర్లు కూడా పాతబడిపోతున్నారు. ఒకప్పటి చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు ఆ ఫేజ్ ను ఫేస్ చేస్తున్నారు. ఓ మంచి సక్సెస్ కోసం… మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో వినాయక్ కూడా ఒకరు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ మధ్య హీరోగా కూడా చేయడానికి సిద్ధపడ్డాడు కానీ అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత మెగా స్టార్ లూసీఫర్ సినిమా రీమేక్ భాద్యతలు వినాయక్ కి అప్పగించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా నుండి కూడా తప్పుకున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో తెలుగులో వచ్చిన సెన్సెష‌న‌ల్ హిట్ మూవీ చ‌త్ర‌ప‌తి హిందీలో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో అల్లుడు శ్రీ‌ను ఫేం బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి డైరెక్ట‌ర్ గా వినాయ‌క్ ప‌నిచేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలుగు ఓరిజిన‌ల్ స్క్రిప్ట్ అందించిన విజ‌యేంద్ర ప్ర‌సాదే ఇప్పుడు హిందీ రీమేక్ కు కూడా క‌థ‌ను అందించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

మరి తెలుగులో సంచలన విజయం దక్కించుకున్న ఛత్రపతి సినిమా ఇప్పుడు రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో.. మరి ఆ సినిమా రేంజ్ ను వినాయక్.. సాయి శ్రీనివాస్ అందుకుంటారా అన్న విషయం సినిమా వచ్చినప్పుడు కాని చెప్పలేం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =