“రౌద్రం రణం రుధిరం” మూవీ కి చిరంజీవి వాయిస్ ఓవర్ ?

Mega Star Chiranjeevi To Give Voice Over To SS Rajamouli Magnam Opus RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. రే స్టీవెన్ సన్ , అలీ సన్ డూడీ ,సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సీనియర్ హీరోయిన్ శ్రియ అతిథి పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం” మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. హిందీ వెర్షన్ కు స్టార్ హీరో అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు , తమిళ , కన్నడ , మలయాళ భాషలకు ఆ యా భాషల స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు సమాచారం. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా “రౌద్రం రణం రుధిరం” మూవీ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. స్టార్ డైరెక్టర్ , స్టార్ హీరోలతో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 9 =