మొత్తానికి థియేటర్స్ ఓపెన్ అవుతుండటంతో చిన్న చిన్నగా సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి కర్చీఫు వేసుకున్నాయి. ఇక త్వరలో క్రిస్మస్ వుంది కాబట్టి ప్రస్తుతం ఈ పండగకు చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే ప్లాన్ లో వున్నాయి. సుమంత్ ప్రధాన పాత్రలో వస్తున్న కపటధారి సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేయడానికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు మరో సినిమాను కూడా క్రిస్మస్ కు రిలీజ్ చేయడానికి ముహుర్తం ఖరారు చేశారు. ఆ సినిమా ఏదో కాదు మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Let’s meet in Theaters this Christmas🎄 🥳
Supreme Hero @IamSaiDharamTej‘s #SoloBrathukeSoBetter will release in theaters on Dec 25th!#SBSBOnDec25th@NabhaNatesh @MusicThaman @subbucinema @BvsnP @bkrsatish @SonyMusicSouth @ZeeStudios_ pic.twitter.com/rEGFGF4tor
— SVCC (@SVCCofficial) November 28, 2020
కాగా `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: