హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” కన్నడ మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్ లో జరిగే ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ హైదరాబాద్ చేరుకోగా , హీరో యశ్ నిన్న హైదరాబాద్ లో అడుగు పెట్టారు. హీరో యశ్ తో పాటు సంజయ్ దత్ కూడా షూటింగ్ లో పాల్గొంటారు. హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ ను డిసెంబర్ నెలలో కంప్లీట్ చేసి 2021 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ పైభారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: