అనన్య పాండే “ఫైటర్ “మూవీ షూటింగ్ ఎక్స్ పీరియన్స్

Ananya Pandey Shares About Her Experience Of Working With Fighter Movie Team

ఒకప్పుడు దక్షిణాది భాషల హీరోయిన్స్ బాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపేవారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ దక్షిణాది మూవీస్ లో నటించడానికి ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు. బాలీవుడ్ మూవీస్ కు ధీటుగా దక్షిణాది భాషా చిత్రాలు భారీ బడ్జెట్ తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ దక్షిణాది మూవీస్ లో అవకాశాలకై ఎదురు చూస్తున్నారు. “ఫైటర్”
మూవీ తో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమర్షియల్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 “మూవీ తో బాలీవుడ్ కు పరిచయమైన అనన్య పాండే సూపర్ హిట్ “పతి పత్ని ఔర్ వో “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. తక్కువ సమయం లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనన్య , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “మూవీ లో విజయ్ కు జోడీగా నటిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ , హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న ఫైటర్ షూటింగ్ ఒక భిన్నమైన ప్రపంచం అనీ, చాలా విషయాలు నేర్చుకున్నాననీ , షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేశాననీ తన షూటింగ్ ఎక్స్ పీరియన్స్ ను అనన్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − nine =