‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ షాకిస్తున్న అనసూయ లుక్

Anasuya Bharadwaj First Look from Thank you brother movie is out

ర‌మేష్ రాప‌ర్తి దర్శకత్వంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ‌, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అశ్విన్ విరాజ్‌ల ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ చేతులు మీదుగా ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేశారు. ప్రెగ్నెంట్ లుక్‌లో, చేతిలో ఫేస్ మాస్క్ ప‌ట్టుకొని కోపంగా చూస్తున్న‌ట్లు క‌నిపిస్తుంటే, ఆమె వెన‌కే మ‌రో ప్ర‌ధాన పాత్ర‌ధారి అశ్విన్ విరాజ్ సీరియ‌స్ లుక్‌లో నిల‌బ‌డి క‌నిపిస్తున్నారు.ఇక ఈలుక్ లో అనసూయ గర్భవతిగా కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చిందనే చెప్పొచ్చు. దీనితో మరోసారి అనసూయ విభిన్నమైన పాత్రతో వస్తుందని తెలుస్తుంది.

టైటిల్ పోస్ట‌ర్ రివీల్ అయిన‌ప్ప‌డు సినిమా క‌థ‌కూ, లిఫ్ట్‌కూ ఏదో సంబంధం ఉంద‌నే విష‌యం అర్థం కాగా, ఇప్పుడు ఆ లిఫ్ట్‌లో అన‌సూయ‌, విరాజ్ ఎడ‌ముఖం, పెడ‌ముఖం పెట్టుకొని నిల్చొని క‌నిపించ‌డంతో సినిమా కంటెంట్‌పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది. కాగా జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. సురేష్ ర‌గుతు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా వైవా హ‌ర్ష‌, అర్చ‌నా అనంత్‌, అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, కాదంబ‌రి కిర‌ణ్‌, అన్న‌పూర్ణ‌, బాబీ రాఘ‌వేంద్ర‌, స‌మీర్‌ నటిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here